Breaking News

రాత్రిళ్లు నగ్నంగా వీడియో కాల్స్‌.. వీఆర్‌కు ఎస్‌ఐ రాజశేఖర్‌ 

Published on Wed, 08/13/2025 - 09:11

పుట్టపర్తి టౌన్‌/ ముదిగుబ్బ: న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన గిరిజన మహిళను లైంగికంగా వేధించడంతో పాటు రాత్రి వేళల్లో నగ్నంగా వీడియోకాల్స్‌ మాట్లాడిన ‘పట్నం’ ఎస్‌ఐ రాజశేఖర్‌పై వేటు పడింది. పోలీసు స్టేషన్‌కు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న అతను అమాయక గిరిజన మహిళను వేధించడంతో వీఆర్‌కు పంపుతూ ఎస్పీ రత్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

 ముదిగుబ్బ మండలం గరుగుతండాకు చెందిన ఓ గిరిజన మహిళలను లైంగికంగా వేధించిన రాజశేఖర్‌ గురించి ‘సాక్షి’ మంగళవారం ‘నాతో వస్తే ఓకే... లేదంటే ఇబ్బంది పడతావ్‌..’ శీర్షికన వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎస్పీ రత్న వెంటనే అతన్ని వీఆర్‌కు పంపారు. అలాగే ఎస్‌ఐ రాజశేఖర్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సంబం«ధిత పోలీస్‌ అధికారులను ఆదేశించారు. విచారణ అనంతరం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

పట్నం ఎస్‌ఐగా జయరాంనాయక్‌ 
‘పట్నం’ ఎస్‌ఐగా కె. జయరాంనాయక్‌ను పోలీసు ఉన్నతాధికారులు నియమించారు. దీంతో  మంగళవారమే ఆయన బాధ్యతలను చేపట్టారు. లైంగిక వేధింపుల నేపథ్యంలో ఇప్పటి వరకూ పట్నం ఎస్‌ఐగా ఉన్న రాజశేఖర్‌ను వీఆర్‌కు పంపిన ఎస్పీ రత్నం..ఆయన స్థానంలో వీఆర్‌లో ఉన్న జయరాంనాయక్‌ను నియమించారు. 

నాతో వస్తే ఓకే.. లేదంటే ఇబ్బందిపడతావ్‌..


 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)