Breaking News

మహిళ అని చూడకుండా.. పోలీసుల పైశాచికత్వం

Published on Thu, 10/31/2024 - 05:13

రామవరప్పాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్నా టీడీపీ గూండాల దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులను టార్గెట్‌ చేస్తూ దౌర్జన్యకాండ సాగిస్తున్నారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించి మహిళ అని కూడా చూడకుండా దుర్బాషలాడుతూ అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర దూమారం రేపింది. విజయవాడరూరల్‌ మండలం ప్రసాదంపాడు కొమ్మా రాము వీధిలో నివాసం ఉంటున్న గంధం వెంకటలక్ష్మికు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు గంధం సంతోష్, రెండో కుమారుడు రవి.

సంతోష్‌ వైఎస్సార్‌సీపీలో యువ నేత. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా కృషి చేశాడు. ఓ కేసు నిమిత్తం  వంశీమోహన్‌ విజయవాడ కోర్టులో వాయిదాకు వచ్చిన సమయంలో సంతోష్‌ కలవడానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ప్రసాదంపాడుకు చెందిన టీడీపీ నాయకుడు, ఉపసర్పంచ్‌ గూడవల్లి నరసయ్య టీడీపీ నాయకులను, పోలీసులను ఉసికొల్పాడు. దీంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంతోష్‌ నివాసం ఉంటున్న ఇంట్లోకి మంగళవారం చొరపడి ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. తొలుత సంతోష్‌ తల్లి తలుపు తీయగా.. దౌర్జన్యంగా నెట్టుకుంటూ ఇంట్లోకి చొరబడి ఆమెతో అనుచితంగా ప్రవర్తిస్తూ ఆమెను వెనక్కి నెట్టేశారు.

వైఎస్సార్‌సీపీ నాయకులను చూసుకుని మిడిసిపడుతున్నారని.. మీ పెద్ద కుమారుడిని అరెస్టు చేయాలంటూ హడావుడి చేశారు. సంతోష్‌  నిద్రిస్తున్నాడని చెబుతున్నా వినకుండా దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి సంతోష్‌పై దాడి చేస్తూ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరుగుతుండగానే చిన్న కుమారుడు రవి తన సెల్‌ఫోన్‌లో ఈ ఘాతుకాన్ని  వీడియో తీస్తుండగా బలవంతంగా ఫోన్‌ లాక్కుని దుర్భాషలాడారు. తన కుమారుడిని ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ వెంకటలక్ష్మి పోలీసులను ప్రశ్నించగా.. ‘నీకు చెప్పాల్సిన అవసరం లేదు.. టీడీపీ నాయకులకు ఎదురెళితే ఇలానే ఉంటుంది’ అంటూ పోలీసులు సంతోష్‌ను ఈడ్చుకెళ్లారు. 

స్టేషన్‌లో విచక్షణా రహితంగా దాడి
టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంతోష్‌ను బలవంతంగా పటమట పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం అక్కడి పోలీసులు.. వంశీని ఎందుకు కలవడానికి ప్రయత్నించావని ప్రశ్నించారు. తన అభిమాన నేతను  కలవడంలో తప్పేముందని సంతోష్‌ బదులిచ్చాడు. దీనికి ఆగ్రహించిన ఎస్‌ఐ హరికృష్ణ సంతోష్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. కాగా, తన కుమారుడిపై అకారణంగా దాడి చేశారని సీసీ ఫుటేజ్‌ను ఆధారంగా చూపుతూ సంతోష్‌ తల్లి వెంకటలక్ష్మి పటమట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. సమస్యను సీపీ, ఏసీపీ, పడమట సీఐ దృష్టికి తీసుకొచ్చినా స్పందించ­లేదని వాపోయింది. కాగా బాధితుడు సంతోష్‌ పోలీసులు పాల్ప­­డిన దుశ్చర్యపై ప్రైవేట్‌ కేసు కూడా పెట్టడం గమనార్హం.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)