Breaking News

‘వెన్నుపోటు దినం’ జయప్రదం

Published on Thu, 06/05/2025 - 08:18

సూపర్‌ సిక్స్‌తో సహా అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదు. ప్రజా     సంక్షేమం విస్మరించి అరాచక పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో కడుపు మండిన ప్రజలు కూటమి సర్కారు వంచనపై గర్జించారు. కూటమి నేతల కుట్రలను ఛేదించుకుని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన     ‘వెన్నుపోటు’ దినం కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి ఉప్పెనలా కదం తొక్కారు. అధికారులకు వినతిపత్రాలతో నిరసన తెలియజేశారు.  

అనంతపురం కార్పొరేషన్‌: కూటమి సర్కారు నయ వంచనను ఎండగట్టేందుకు,చంద్రబాబు సర్కార్‌ను మేలుకొలిపేందుకు వైఎస్సార్‌ సీపీ బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది.అనంతపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వ ర్యంలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. పాతూరు చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ జరిగింది. అనంతపురం పార్లమెంట్‌ పార్టీ పరిశీలకులు నరేష్‌కుమార్‌ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, మేయర్‌ వసీం, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమే‹Ùగౌడ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కాగజ్‌ఘర్‌ రిజ్వాన్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర తదితరులు పాల్గొన్నారు.  

ట నార్పలలో మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ స్థానిక వాలీ్మకి ఆలయం నుంచి ప్రారంభమై తహసీల్దార్‌ కార్యాలయం వరకు సాగింది. శైలజానాథ్‌ మాట్లాడుతూ చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ నాగరత్నమ్మ, జెడ్పీటీసీలు భాస్కర్, బోగాతి ప్రతాప్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ట వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆధ్వర్యంలో రాప్తాడులో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.  

⇒ ఉరవకొండలో సమన్వయకర్త వై. విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఉరగాద్రి ఆలయం నుంచి టవర్‌ క్లాక్‌ మీదుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ సూపర్‌సిక్స్‌ హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.  

⇒  గుంతకల్లులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి ఆ«ధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమికి డిపాజిట్లు రావన్నారు.కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ భవాని, వైస్‌ చైర్‌పర్సన్‌ నైరుతి రెడ్డి, గుంతకల్లు ఎంపీపీ మాధవి,  గుత్తి పట్టణ కనీ్వనర్‌ మధుసూదన్‌ రెడ్డి పాల్గొన్నారు.  

⇒  రాయదుర్గంలో సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ వినాయక సర్కిల్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు సాగింది.ఎమ్మెల్సీ శివరామి రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత విధానాలతో ప్రజలను మభ్యపెడుతోందన్నారు. సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ మహిళలు, రైతులు, యువత ఇలా అన్ని వర్గాలకూ చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు.  

⇒  కళ్యాణదుర్గంలో సమన్వయకర్త తలారి          రంగయ్య ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.  రంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో     ముందుకెళ్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. ఏడాదిగా ఒక్క హామీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ రాజ్‌కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌ రెడ్డి, నేతలు ఉమా, వెంకటేశులు, తిమ్మరాయడు పాల్గొన్నారు.  

⇒ యాడికి మండల కేంద్రంలో ‘వెన్నుపోటుదినం’ నిరసన ర్యాలీ... కార్యక్రమ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు ఆధ్వర్యంలోజరిగింది. వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. సుధాకర్‌ బాబు మాట్లాడుతూ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తప్పక బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో  వైఎస్సార్‌ సీపీ నేతలు హర్షవర్దన్‌ రెడ్డి, రమేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ప్రభుత్వ మెడలు వంచుతాం..  
అనంతపురంలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులతో కాలయాపన చేసిందని ధ్వజమెత్తారు. సూపర్‌ సిక్స్‌తో పాటు 143 హామీలను గుప్పించి ఇంత వరకు ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా పథకాలు అమలు చేయించేలా వైఎస్సార్‌ సీపీ పోరాడుతుందన్నారు. అనంతపురం పార్లమెంట్‌ పార్టీ పరిశీలకులు నరే‹Ùకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు   చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. హంద్రీ –నీవా కాలువ సామర్థ్యాన్ని 3,800 క్యూసెక్కులకే పరిమితం చేసి భవిష్యత్తులో నీటి అవసరాలకు తీవ్ర ఇబ్బంది తలెత్తేలా చేశారన్నారు.  

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)