Breaking News

లిక్కర్‌ కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి భారీ ఊరట

Published on Fri, 10/10/2025 - 12:13

సాక్షి, ఢిల్లీ: అక్రమ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి(chevireddy mohith reddy)కి భారీ ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఆయనకు శుక్రవారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

లిక్కర్‌ కేసులో మోహిత్ రెడ్డిని ఏ-39గా, ఆయన తండ్రి.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఏ38 నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. జూన్‌ 18వ తేదీన భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయగా.. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఆయన జ్యుడీషియల్‌ రిమాండ్‌ మీద ఉన్నారు. ఇక.. మద్యం ముడుపుల సొమ్మును మోహిత్‌ అధికార వాహనాల ద్వారా తరలించారన్నది సిట్‌ ఆరోపణ. అయితే.. 

ఈ కేసులో ఉపశమనం కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. ఊరట దక్కలేదు. దీంతో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మోహిత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించగా.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదించారు. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 

కేవలం తన పేరుతో ఉన్న కారులో డబ్బు పట్టుబడ్డాయని కేసు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని మోహిత్‌రెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే.. మోహిత్‌రెడ్డి వాదనలతో ఏకీభవించిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది. 

ఇదీ చదవండి: టార్గెట్‌ ఎస్సీలు.. బాబు కుతంత్రం

 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)