Breaking News

కడప నగరంలో తీవ్ర విషాదం, కుటుంబ కలహాలతో..!!

Published on Mon, 10/13/2025 - 07:38

వైఎస్సార్‌ జిల్లా: కడప నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.కుటుంబ కలహాలతో భార్యాభర్తలు బిడ్డతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అదే సమయంలో.. వాళ్లను మందలించిన ఇంటి పెద్ద గుండెపోటుతో కన్నుమూసింది.

ఆర్పీఎఫ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 11గం. సమయంలో రైల్వే స్టేషన్‌ సమీపంలోని మూడో నంబర్‌ ట్రాక్‌పై ఓ కుటుంబం వేగంగా వస్తున్న గూడ్స్‌ రైలుకు ఎదురుగా నిల్చుని ఆత్మహత్యకు పాల్పడింది. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుల్లో భర్త(35), భార్య(30)తో పాటు ఏడాదిన్నర చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు.

అయితే మృతుల్ని శంకరాపురానికి చెందిన శ్రీరాములు, శిరీష, వాళ్ల కొడుకు రిత్విక్‌గా నిర్ధారించారు. శ్రీరాములు, శిరీష ఏదో విషయంలో గొడవ పడ్డారు. దీంతో శ్రీరాములు నాన్నమ్మ సుబ్బమ్మ వాళ్లను మందలించింది. దీంతో మనస్థాపం చెందిన భార్యాపిల్లలతో బయటకు వెళ్లిపోయారు. అది తట్టుకోలేక ఆమె గుండెపోటుతో కన్నుమూసింది.అయితే.. కాసేపటికే గూడ్స్‌ రైలు కింద పడి ఆ భార్యాభర్తలు బిడ్డతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. 

భార్యాభర్తలు ఎందుకు గొడవపడ్డారు, సుబ్బమ్మ ఏమని మందలించింది.. తదితర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. బంధువుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)