Breaking News

దోషులు ఎవరూ తప్పించుకోలేరు: మంత్రి తానేటి వనిత

Published on Wed, 05/03/2023 - 20:10

సాక్షి, తూర్పుగోదావరి: అమరావతి భూముల కుంభకోణంపై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్) దర్యాప్తుకు ప్రభుత్వం చేసిన అప్పీల్ ను పరిగణనలోకి తీసుకుని మళ్లీ విచారణ జరిపించండని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, స్వాగతిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. బుధవారం కొవ్వూరు మంత్రి క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

గత ప్రభుత్వ అవినీతికి సంబంధించి సిట్ ఏర్పాటుపై 'స్టే' విధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చేసిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిందన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరగకపోతే దర్యాప్తును ప్రాథమిక దశలోనే ఎందుకు అడ్డుకున్నారని హోంమంత్రి ప్రశ్నించారు.
చదవండి: చంద్రబాబుకు బిగ్‌ షాక్‌.. ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందంటే?

గత ప్రభుత్వంలో జరిగిన అమరావతి భూముల కుంభకోణం, దళితుల అసైన్డ్ ల్యాండ్స్, ఔటర్ రింగ్ రోడ్డులో అవకతవకలు, భారీ ప్రాజెక్టుల్లో నిబంధనల ఉల్లంఘనలు తదితర అంశాలపై వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్న సమయంలో హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై గత ప్రభుత్వంలోని  నాయకులు స్టే తెచ్చుకోవడం జరిగిందన్నారు. ప్రాథమిక విచారణలో ఉండగానే హైకోర్టులో స్టే తెచ్చుకున్నారని.. గత ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి, ఏ అక్రమాలు జరగకపోతే విచారణ ఎదుర్కొవడానికి ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నించారు.

తప్పు చేశామని భయం ఉండబట్టే స్టే తెచ్చుకున్నారన్నారు. విచారణను ఎదుర్కొని వాళ్ల నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. విచారణ జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు  బయటపడతాయన్న భయంతోనే ప్రాథమిక విచారణలో ఉండడానే హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారని తెలిపారు. గతంలో కూడా ఈ అంశంపై మంత్రివర్గ ఉప సంఘం వేసినప్పుడు భూముల కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలను అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారని తెలిపారు.
చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక

ఆ విషయాలన్నీ అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిపి ప్రజల దృష్టికి తీసుకొచ్చామన్నారు. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో జరిగిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా విచారణ చేస్తామన్నారు. దోషులు ఎవరూ తప్పించుకోలేరని, ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని అన్నారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని తానేటి వనిత తెలిపారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)