Breaking News

నారా లోకేశ్‌ శాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Published on Tue, 01/06/2026 - 03:06

సాక్షి, అమరావతి: నారా లోకేశ్‌ మంత్రిగా వ్యవహరిస్తున్న విద్యాశాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పవర్‌ఫుల్‌ వ్యక్తి కింద పనిచేస్తున్నందున తమను ఏమీ చేయలేరన్న భావన విద్యాశాఖ అధికారుల్లో కనపడుతోందని వ్యాఖ్యానించింది. ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారులు తమను తాము చాలా గొప్ప వారిగా, కోర్టుకన్నా శక్తివంతులుగా భావిస్తున్నారని మండిపడింది.

కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా వారికి ఏ మాత్రం లెక్క లేకుండా పోయిందని తెలిపింది. పైగా న్యాయస్థానాలతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారని పేర్కొంది. ఇందుకు ప్రత్యేక కారణాలున్నాయంది. ఇలాంటి అధికారులను ఎలా డీల్‌ చేయాలో తమకు బాగా తెలుసునంది. కేజీబీవీల్లో పీజీటీల బదిలీలకు సంబంధించి అప్పీల్‌పై జరుగుతున్న విచారణ సందర్భంగా హైకోర్టు... విద్యాశాఖలో ఏదీ కూడా సక్రమంగా జరగడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.  

సర్వశిక్షాభియాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వ్యక్తిగత హాజరుకు ఆదేశం 
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పార్ట్‌టైం పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న వారిని ఒప్పందం ప్రకారం యథాతథంగా కొనసాగించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచి్చన ఉత్తర్వులను, అలాగే సింగిల్‌ జడ్జి ఇచి్చన ఉత్తర్వులను అమలు చేస్తామంటూ ఇచ్చిన హామీని ఉల్లంఘించినందుకు సర్వశిక్షాభియాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (పీడీ) బి.శ్రీనివాస్‌రావుపై హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. ఆయనకు కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అలాగే వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని శ్రీనివాస్‌రావును ఆదేశిస్తూ ఆయనకు నోటీసు ఇచి్చంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కేసు వివరాలు ఇవీ..
⇒ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పార్ట్‌టైం పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న తమను అర్ధంతరంగా తొలగించడాన్ని సవాలు 
చేస్తూ పలువురు పీజీటీలు  హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  

⇒ ఈ తీర్పును సవాలు చేస్తూ అధికారులు ధర్మాసనం ముందు గత ఏడాది జనవరిలో అప్పీల్‌ దాఖలు చేశారు.
⇒ ఈ సందర్భంలో కోర్టు ఆదేశాలను, కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించిన అధికారి ఎవరని ధర్మాసనం ప్రశ్నించింది.
⇒ సర్వశిక్షాభియాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాస్‌రావు అని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో ధర్మాసనం ఆయనపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది.

⇒ ఈ అప్పీల్‌పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్‌ బట్టు దేవానంద్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.
⇒ విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వారి సేవలను కొనసాగించాలని ఆదేశించారు.  

⇒ పీజీటీల తరఫు న్యాయవాది జైభీమ్‌ రావు వాదనలు వినిపిస్తూ “ఒప్పందం ప్రకారం రిట్‌ పిటిషనర్లు ఎక్కడ పనిచేస్తున్నారో వారిని అక్కడే కొనసాగిస్తూ, వారికి ఆ మేర వేతనాలు చెల్లించాలని సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చారు.  అయితే సర్వశిక్షాభియాన్‌ అధికారులు మాత్రం పిటిషనర్లను వేరే ప్రాంతానికి బదిలీ చేయడంతో పాటు నెలవారీ ఇచ్చే వేతనాన్ని పని గంటల ఆధారంగా చెల్లించేలా మార్పులు చేశారు. అంతేకాక సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను  యథాతథంగా అమలు చేస్తామంటూ ఈ కోర్టుకు ఇచ్చిన హామీని సైతం అధికారులు ఉల్లంఘించారు’ అని ధర్మాసనానికి విన్నవించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)