Breaking News

తిరువూరు మున్సిపల్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Published on Tue, 05/20/2025 - 10:50

సాక్షి,గుంటూరు: తిరువూరు మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అరగంటలో భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పోలీసులకు   ఆదేశాలు జారీ చేసింది. డీసీపీ స్థాయి అధికారితో కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని సూచించింది. 

తిరువూరు మున్సిపల్‌ ఎన్నికపై వైఎస్సార్‌సీపీ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని పేర్కొంది. 

వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై మంగళవారం (మే20) ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలను పోలీసులు పాటించడం లేదంటూ వైఎస్సార్‌సీపీ తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు అరగంటలో డీసీపీ స్థాయి అధికారితో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు భద్రత కల్పించడమే కాదు, తక్షణమే ప్రశాంత ఎన్నికలకు చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. 

కాగా, తిరువూరు మున్సిపల్‌ ఎన్నిక నేపథ్యంలో నేటి ఉదయం నుండి టీడీపీ నేతలు తిరువూరులో అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ఎన్నికలకు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడింది. తిరువూరు వెళ్లే వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. 

ఈ క్రమంలో అరగంటలో డీసీపీ స్థాయి అధికారితో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు భద్రతకు కల్పించాలని రాష్ట్ర హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. అంతేకాదు, భద్రతా ఏర్పాట్లు ఎవరు సమీక్షిస్తున్నారో అరగంటలో చెప్పాలని తెలిపింది.    

డీసీపీ మహేశ్వరరాజుకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతలు
తిరువూరు ఉప ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతల్ని డీసీపీ మహేశ్వరరాజుకు అప్పగించింది. ఎన్నిక పూర్తయ్యేంత వరకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి పూర్తిస్థాయి భద్రతతో ఎన్నికల హాలుకు తీసుకెళ్లాలని సూచించింది.  ఎన్నిక పూర్తయ్తేంతవరకు మహేశ్వరరాజుదే బాధ్యత హైకోర్టు చెప్పింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)