Breaking News

పుంగనూరు అల్లర్లపై నేడు హైకోర్టులో విచారణ.. చంద్రబాబే ఏ1..

Published on Wed, 08/16/2023 - 09:22

సాక్షి, అమరావతి: నేడు పుంగనూరు అల్లర్ల కేసుపై హైకోర్టులో విచారణ జరుగనుంది. కాగా, కొద్దిరోజుల క్రితం పుంగనూరులో టీడీపీ మూకలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఎల్లో బ్యాచ్‌ రెచ్చిపోయి పోలీసులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వీరి దాడిలో పదుల సంఖ్యలో పోలీసులు గాయపడగా.. కానిస్టేబుల్‌ కంటిచూపు కోల్పోయారు. 

ముందుగానే దాడులకు ప్లాన్‌..
మరోవైపు.. పుంగనూరు వద్ద ముందస్తు ప్రణాళికలో భాగంగానే టీడీపీ శ్రేణులను బహిరంగంగా రెచ్చగొట్టి దా­డులు చేయించిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. విధ్వంసానికి దిగాలని చంద్రబాబు బహిరంగంగానే పిలుపునివ్వగా.. పార్టీ శ్రేణులు, కిరాయి మూకలు దాడులకు తెగబడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ‘పచ్చ మీడియా’ సహా అన్ని చానళ్లలోనూ ప్రసారమయ్యాయి. వాస్తవానికి తంబళ్లపల్లె నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన లేకపోయినా.. ముందురోజు సాయంత్రం పర్యటనలో మార్పు చేయడం.. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో లేకున్నా ములకలచెరువు, బురకాయలకోట, అంగళ్లు గ్రామాల పర్యటనకు వెళ్లడం వంటి అంశాలు చంద్రబాబు ఈ కుట్రకు ఏవిధంగా తెర తీశారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

చంద్రబాబే ఏ1..
గతంలో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. ఆ ఆడియో టేపులోని మాటలు తనవి కాదని బొంకారు. కానీ.. తాజా కేసులో పార్టీ శ్రేణులను రెచ్చగొట్టిన వీడియో సాక్ష్యాలు ఉండటంతో ఈ కేసులో అడ్డంగా దొరికిపోయారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబు తాను రెచ్చగొట్టలేదని మాట మారిస్తే.. పోలీసుల వద్ద ఉన్న, ఎల్లో మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోలను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపి.. చట్టపరంగా ముందుకు వెళ్లడానికి పోలీస్‌ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏ1గా కేసు నమోదైంది.

ఇది కూడా చదవండి: అడ్డంగా బుక్కయిన చంద్రబాబు!

90మంది అరెస్ట్‌..
పుంగనూరు విధ్వంసంలో ఇప్పటి వరకు ఏడు నేరాలకు సంబంధించి మొత్తం 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. వారిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం వరకు  90 మందిని అరెస్ట్‌ చేశారు.వారికి కోర్టు రిమాండ్‌ విధించడంతో కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు చల్లా బాబుతోపాటు  కుట్ర, వ్యూహ రచన, దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న పలువురిని పోలీసులు గుర్తించారు. వారి గత చరిత్రను కూడా నిశితంగా పరిశీలించారు. దాడుల్లో భాగస్వాములైన వారిలో ఎక్కువ మంది పాత నేరాల చరిత్ర చూసి పోలీసులే షాక్‌ అయ్యారు. 

ఇది కూడా చదవండి: పచ్చ గూండాలు పేట్రేగిన వేళ..

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)