Breaking News

AP: మరింతమంది రైతులకు పెట్టుబడి సాయం

Published on Fri, 01/06/2023 - 09:00

సాక్షి, అమరావతి: సాధ్యమైనంత ఎక్కువమందికి పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పీఎం కిసాన్‌ పథకం కింద విడతకు రూ.2 వేల చొప్పున ఏడాదిలో మూడు విడతలుగా కేంద్రం పెట్టుబడి సాయం చేస్తోంది. ఆ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కలిపి వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ పేరిట రూ.13,500 చొప్పున రైతులకు పెట్టుబడి సాయం జమచేస్తోంది.

పంట భూమి గల యజమానులకు మాత్రమే కేంద్రం సాయం అందిస్తుంటే.. అటవీ, దేవదాయ భూముల సాగుదారులతోపాటు కౌలుదారులకు సైతం రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది. అయితే.. వివిధ సమస్యలు, సాంకేతిక కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 12.98 లక్షలమందికి పీఎం కిసాన్‌ సాయం అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో క్రియాశీలక రైతులు 48.43 లక్షలమంది ఉన్నారు. వీరిలో ఈ–కేవైసీ పూర్తయిన 35.45 లక్షలమంది రైతులు మాత్రమే పీఎం కిసాన్‌కు అర్హత పొందారు. మిగిలినవారికి ఈ నెల 15వ తేదీలోగా ఈ కేవైసీ పూర్తిచేసి నూరుశాతం మంది రైతులకు పీఎం కిసాన్‌ సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

ప్రధాన సమస్యలు ఇవే..
ప్రధానంగా లబ్ధిదారు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి/పింఛనుదారు ఉండటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌ల్యాండ్, ఎన్‌పీసీఐ పోర్టల్‌లో మ్యాపింగ్‌ కాకపోవడం, ఆదాయపన్ను చెల్లింపుదారులై ఉండడం, ఆధార్‌ అప్‌డేట్‌ చేయడం వలన అనుసంధాన సమయంలో విఫలం కావడం, ఆర్టీజీఎస్, ఎన్‌ఐసీ సమస్యలు, అకౌంట్‌ బ్లాక్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ తప్పుగా నమోదు కావడం, డూప్లికేట్, ఉమ్మడి ఖాతాలుండడం, చనిపోవడం వంటి వివిధ కారణాలతో వీరంతా ఇబ్బందిపడుతున్నారు. కేంద్ర వెబ్‌ల్యాండ్‌ మ్యాపింగ్, ఈ–కేవైసీ పూర్తిగాకపోవడమే ప్రధాన సమస్యగా ఉంది. 

ఆర్బీకే స్థాయిలో అర్హుల గుర్తింపు
పెండింగ్‌ దరఖాస్తుల డేటాను ప్రభుత్వం మండల వ్యవసాయాధికారులతో పాటు రైతుభరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) కూడా పంపించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తుదా­రులను గుర్తించి వారికి అవ­గా­హన కల్పించాలని ఆదేశించింది. దరఖాస్తు­దారులు ఎదు­ర్కొంటున్న సాంకేతిక సమస్యల పరిష్కారంలో ఆర్బీకే సిబ్బంది సాయపడ­తారు. మండల వ్యవసాయాధికారి వద్ద కిసాన్‌ పోర్టల్‌లో తగిన వివరాలను అప్‌లోడ్‌ చేయించి, ఆ తర్వాత బ్యాంకు ద్వారా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) పోర్టల్‌తో మ్యాపింగ్‌ చేయించనున్నారు.

తొలు­త డిసెంబర్‌ నెలాఖరువరకు గడువునిచ్చిన కేంద్రం.. రాష్ట్రప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. గడువులోగా ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. ఇంకా ఈ–కేవైసీ చేయించుకోని రైతులను ఆర్బీకే స్థాయిలో గుర్తించి వారితో దగ్గరుండి  ఈ–కేవైసీ చేయించాలని సూచించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి పీఎం కిసాన్‌ సాయం అందిం­చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎంవైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీలోగా మిగిలిన రైతులందరితో ఈ–కేవైసీ చేయించడంతోపాటు ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్టు వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)