తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
Corona Virus: ఏపీలో కొత్తగా 878 కరోనా కేసులు
Published on Mon, 08/30/2021 - 17:02
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 41,173 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 878 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 13 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,838 కు చేరింది.
గత 24 గంటల్లో 1,182 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,84,301 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,862 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,13,001 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,65,76,995 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
చదవండి: దేశంలో 45,083 కొత్త కేసులు
Tags : 1