Breaking News

YSRCP: వైఎస్సార్‌సీపీ 9వ జాబితా విడుదల

Published on Fri, 03/01/2024 - 21:02

సాక్షి, గుంటూరు: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మార్పులు చేస్తున్న అధికార వైఎస్సార్‌సీపీ.. తొమ్మిదవ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిల నియమిస్తూ  లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో.. నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది.

అలాగే.. కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇంతియాజ్‌(రిటైర్డ్‌ ఐఏఎస్‌), మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్యను నియమించింది. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.. ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేసింది. ఇంతియాజ్‌ ఈ మధ్యే వీఆర్‌ఎస్‌ తీసుకుని వైఎస్సార్‌సీపీలో చేరారు.

తాజాగా మంగళగిరిలో జరిగిన వైఎస్సార్‌సీపీ కీలక సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కోసం పార్టీ తరఫున ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తైందని..  ఒకటిరెండు మార్పులు తప్పించి ఇప్పటిదాకా ప్రకటించిన ఇన్‌ఛార్జిలకే టికెట్లు దాదాపు ఖాయమని ప్రకటించారు.

ఇప్పటివరకు విడుదలైన తొమ్మిది జాబితాల వారీగా చూస్తే..   74 అసెంబ్లీ స్థానాలకు, 21 పార్లమెంట్‌ స్థానాలకు ఇన్‌ఛార్జిల జాబితాల్ని వైఎస్సార్‌సీపీ విడుదల చేసింది . తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎంపీ, 8 అసెంబ్లీ),  ఐదో జాబితాలో 7 స్థానాలకు(4 ఎంపీ, 3  అసెంబ్లీ స్థానాలకు) సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్‌సీపీ.

ఆరో జాబితాలో 10 స్థానాలకు(4 పార్లమెంట్‌, 6 అసెంబ్లీ స్థానాలకు).. ఏడో జాబితాలో 2 అసెంబ్లీ స్థానాలకు, ఎనిమిదో జాబితాలో 5 (2 ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు).. తాజాగా తొమ్మిదో జాబితాలో 3 స్థానాలకు(ఒకటి పార్లమెంట్‌, రెండు అసెంబ్లీ స్థానాలకు) సమన్వయకర్తలను నియమిస్తూ/మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్‌సీపీ. 

‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ మొదటి నుంచి పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)