Breaking News

రెండు పార్టీల రిమోట్‌ బాబు చేతిలో.. షర్మిల నిర్ణయం బాధించింది: సీఎం జగన్‌

Published on Tue, 04/30/2024 - 11:44

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, చంద్రబాబు నాయుడు.. కూటమి ఇస్తున్న హామీలతో మోసపోవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ప్రజలకు పదే పదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న ఆయన తాజాగా ఇండియా టుడే రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా రాజకీయాలపై ఆయన స్పందించారు.  

ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో మేం పోరాడుతున్నాం. ఈ రెండు పార్టీల రిమోట్లు చంద్రబాబు చేతిలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలను ఆయనే నియంత్రిస్తున్నారు.

కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న తన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల గురించి సీఎం జగన్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక్కటే కాదు ఆమెకు డిపాజిట్లు కూడా దక్కబోవనే విషయం తనను బాధకు గురి చేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు.

.. ఏపీలో నాకు పోటీగా రాజకీయాలు చేసేలా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు, షర్మిలను ప్రభావితం చేశారు. నాపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు, చనిపోయాక నా తండ్రి..దివంగత మహానేత వైఎస్సార్‌ పేరును  ఛార్జిషీట్‌లో చేర్చిన పార్టీతో ఆమె చేతులు కలిపారు. ఇదంతా ఎంతో బాధ కలిగిస్తోంది. ఎవరు ఏమిటనేది ఈ ఎన్నికల ద్వారా ప్రజలే నిర్ణయిస్తారు.

తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపైనా సీఎం జగన్‌ స్పందించారు. ‘‘ఒకరు తప్పు చేశారా? లేదా? అనేది న్యాయస్థానాలు నిర్ధారిస్తాయి. జైలుశిక్ష పడిందీ అంటే ఏదో తప్పు చేశారనే అర్థం. చంద్రబాబు తప్పు చేశాడనడానికి అవసరమైనన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి’’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

జగన్‌ ముఖ్యమంత్రిగా కొనసాగితేనే ఏపీలో సంక్షేమం ఉంటుందని,  అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన, చేయూత, ఆసరా, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు, వలంటీర్ల ద్వారా నెలవారీ సామాజిక పింఛన్లు డోర్ డెలివరీ వంటి కార్యక్రమాలు కొనసాగుతాయని సీఎం జగన్‌ ఆ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టం చేశారు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)