Breaking News

AP Cabinet: ఆ ఒక్క మంత్రి పదవి ఎవరికో?

Published on Wed, 06/12/2024 - 07:11

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే మిత్ర కూటమి నేడు అధికారం చేపట్టబోతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వేళ.. 24 మంత్రులతో కూడిన జాబితా విడుదల విడుదలయ్యింది. వీళ్లందరితో కలిసే ముఖ్యమంత్రిగా ఇవాళ విజయవాడలో ప్రమాణం చేయబోతున్నారు ఆయన. అయితే.. 

మరోవైపు  ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో 25 స్థానాలు ఉన్నాయి. తనతో సహా 25(24 మంది మంత్రులు)తో కూడిన జాబితానే చంద్రబాబు రిలీజ్‌ చేశారు. అంటే.. ఒక్క స్థానాన్ని ఆయన భర్తీ చేయకుండా వదిలేశారన్నమాట. ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానం మిత్రపక్షాలకా? లేదంటే టీడీపీకా? అనే అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు ఎవరికి ఏ పోర్ట్‌పోలియో కేటాయిస్తారు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల్లో ఈ అంశంపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్త: చంద్రబాబు కేబినెట్‌.. సామాజిక వర్గాల వారీగా చూస్తే..

మంగళవారంనాడు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్‌ ఆహ్వానించాక.. అర్ధరాత్రి దాటాక కొత్త మంత్రుల జాబితా విడుదల చేశారు. తొలుత జనసేనకు 4, బీజేపీ 2 పదవులు దక్కుతాయనే ప్రచారం నడిచింది. కానీ, కొత్త మంత్రుల జాబితాలో టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి కేబినెట్‌లో చోటు దక్కింది. వీళ్లలో 17 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రులు కాబోతున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు కూడా ఇందులో చోటు దక్కింది. 

ముందు నుంచి వినవస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నారు. ఆ పార్టీ నుంచి సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌లు మంత్రులు కాబోతున్నారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్‌కు బెర్త్‌ దక్కింది. బీజేపీ నుంచి ఎవరికి చోటు దక్కాలి అనే అంశంపై చర్చల వల్లే మంత్రుల జాబితా ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)