Breaking News

‘టీటీడీ ఛైర్మన్‌ ఆ పోస్టులను అమ్ముకున్నారు’

Published on Fri, 06/05/2026 - 13:35

సాక్షి, తిరుపతి: టీటీడీలో మరో కొత్త వివాదం తెరపైకి రాగా, 60 ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీలో అక్రమాలపై విచారణ జరగాలని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కోర్టు నిలిపేసిన పోస్టులపై నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారు? అంటూ ఆయన ప్రశ్నించారు. లీగల్‌ సమస్యలపై వస్తాయనే కోర్టు తాతాల్కికంగా నిలిపేసిందన్న భూమన.. టీటీడీ ఛైర్మన్‌ ఒక్కో పోస్ట్‌ను రూ.30-40 లక్షలకు అమ్ముకున్నారంటూ ఆరోపించారు.

‘‘రాయలసీమ  ప్రాంత వాసులకు ప్రత్యేక కేటాయింపులు జరపకపోవడంతో న్యాయ వివాదాలు తలెత్తే  అవకాశం ఉండటంతో తాత్కాలికంగా నోటిఫికేషన్ నిలిపివేశాం. ఎన్నికల తర్వాత నిర్వహించాలని నిలిపివేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన ఏడాదిన్నర తర్వాత గత మే నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు.

..టీటీడీ చైర్మన్, ఆయనకు కొమ్ముకాసే ఇద్దరు సభ్యులు సహకారంతో ఒక్కో పోస్ట్‌ను 30-40లక్షలకు అమ్ముకున్నారనే చర్చ జరుగుతోంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. 2024-25 ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించలేదు. రాష్ట్రం మొత్తం ఒకే జోన్‌గా పరిగణించారు, రాయలసీమ ప్రాంతం వారికి అన్యాయం జరిగింది. రాయలసీమ ప్రాంత వాసులకు ప్రత్యేక అవకాశం కల్పించాలనే ఆ రోజు నోటిఫికేషన్ రద్దు చేశాం.

..రాష్ట్రం మొత్తం ఒకే జోన్ కిందకు తీసుకు వచ్చారు. ఒక్కో పోస్ట్ లక్షలాది రూపాయలకు పోస్ట్‌లు అమ్ముకుంటున్నారు. 60 పోస్టుల భర్తీకి మద్రాస్ ఐఐటీ వాళ్లకు బాధ్యత అప్పగించాం. పారదర్శకంగా ఉండాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం.. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా నోటిఫికేషన్ నిలిపివేశాము’’ అని భూమన వివరించారు.

టీటీడీలో తెరపైకి మరో కొత్త వివాదం

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)