రివర్స్‌ డ్రామా.. వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు

Published on Thu, 12/18/2025 - 09:25

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెర తీసింది. మాచవరం పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేయించింది.

సునీల్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయ్యింది. 2024 జులైలో వంశీ, ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డాడని తాజాగా ఆ వ్యక్తి మాచవరం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో.. వంశీ సహా మరో 20 మందిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఇక్కడ జరిగింది వేరు!. 

2024 జూలై 7న విజయవాడలోని వంశీ ఇంటిపై టీడీపీ గూండాలు కత్తులు, కర్రలు, రాడ్లు, రాళ్లతో రెచ్చిపోయారు. అయితే వంశీ ఇంటిపై జరిగిన దాడిని.. తమ పైన దాడిగా రివర్స్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం. పైగా ఫిర్యాదులో తమను ఉద్ధేశపూర్వకంగా రెచ్చగొట్టి.. దూషించి దాడి చేశారంటూ సునీల్‌ పేర్కొనడం గమనార్హం. 

ఇంతకు ముందు.. వల్లభనేని వంశీని అక్రమ కేసుల్లో కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో నకిలీ ఇళ్ల పట్టాల కేసుతో వంశీని కూటమి ప్రభుత్వం అరెస్ట్‌ చేయించింది.  ఈ కేసులో విజయవాడ జైల్లో ఉన్న ఆయన.. నూజివీడు కోర్టు బెయిల్‌ ఇవ్వడంతో  137 రోజుల తర్వాత బయటకు వచ్చారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)