Breaking News

టీటీడీ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు

Published on Fri, 09/18/2026 - 22:02

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తేల్చేసింది. జంతు కొవ్వు కలిసిందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2019 నుంచి 2024 మధ్య టీటీడీకి సరఫరా అయిన నెయ్యికి సంబంధించి అన్ని విధాలా విచారించింది. ఏ దశలో కూడా జంతువుల కొవ్వు కలిపారనే దానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని గుర్తించింది. 

తద్వారా సీఎం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, ఇతర కూటమి నేతలు పనిగట్టుకుని దు్రష్పచారం చేసినట్లు తేటతెల్లమైంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు.. భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయన్న ఆలోచన లేకుండా, కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దారుణంగా ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వాడారని నిరాధారంగా ప్రకటించి కలకలం రేపారు. 

చంద్రబాబు సీఎం అయ్యాకే.. తిరుమలకు వచ్చిన నెయ్యి ట్యాంకర్లలో నాణ్యత లేదని కొన్నింటిని వెనక్కు పంపడం, ఆ నెయ్యి అసలే వాడక పోయినా.. వాడారంటూ అబద్ధం చెప్పడం.. దానిపై ఎల్లో మీడియా వరుస కథనాలు వెలువరించడం.. సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం.. సీబీఐ సిట్‌ కూడా దర్యాప్తు చేసి, జంతుకొవ్వు కలవలేదని నివేదిక ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో ఇదే విషయమై తిరుపతిలో నమోదైన కేసుపై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. పలు సంస్థలను, పలువురిని విచారించి.. ఎట్టకేలకు తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్దారించింది.

 చంద్రబాబు కేవలం తన కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ భాగస్వామ్య సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే ఇలా తప్పుడు ఆరోపణలు, దు్రష్పచారం చేశారని ఇదివరకే స్పష్టమైంది. ఇప్పుడు ఈడీ కూడా జంతువుల కొవ్వు కలవలేదని తేల్చడంతో ఇదంతా చంద్రబాబు డైవర్షన్‌ డ్రామా అని మరోమారు స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. హామీలు నెరవేర్చలేని తరుణంలో ఎప్పటికప్పుడు డైవర్షన్‌ డ్రామాలకు తెర లేపడం చంద్రబాబుకు అలవాటేనని, ఆ పరంపరలోనే శ్రీవారి లడ్డూపై కూడా ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

 


 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)