Breaking News

ఆర్టీసీ కండక్టర్‌పై దాడి

Published on Tue, 10/28/2025 - 06:17

రామచంద్రపురం రూరల్‌: బస్సు కండక్టర్‌పై దాడి చేసి ఆయన కాలు విరగ్గొట్టిన నిందితులపై ఐదు రోజులైనా చర్యల్లేకపోవడంపై ఆర్టీసీ సంఘాలు మండిపడ్డాయి. సోమవారం రామచంద్రపురం డిపోలో గేట్‌ మీటింగ్‌ నిర్వహించి నిరసన తెలిపాయి. బాధిత కండక్టర్‌ కుక్కల మంగేశ్వరరావుకు న్యాయం చేయా­లని డిమాండ్‌చేశాయి. బాధితుడి కథనం ప్రకారం.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న మంగేశ్వరరావు ఈ నెల 23న  కోరుమిల్లి– రాజమండ్రి సరీ్వసులో విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో కోరుమిల్లికి చెందిన తుట్టపు అన్నపూర్ణ బస్సు ఎక్కి మాచవరం వెళ్లాలని చెప్పారు. అయితే ఆమె సరైన గుర్తింపు కార్డు చూపకపోవడంతో చార్జీ చెల్లించాలని మంగేశ్వరరావు స్పష్టం చేశారు.

దీంతో ఆమె కండక్టర్, డ్రైవర్‌పై దౌర్జన్యం చే­సింది. దీంతో కండక్టర్, డ్రైవర్‌ అన్నపూర్ణను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాలని భావించారు. అయితే తోటి ప్రయా­ణికుల విజ్ఞప్తి మేరకు వివాదాన్ని అంతటితో ముగించారు. బస్సు రాజమండ్రి వెళ్లి తిరిగి కోరుమిల్లి చేరుకున్న సమయంలో  అన్న­పూర్ణ కుమారుడు భూషణం, అతడి స్నేహితుడు అడ్డాల ఆదినారాయణ బస్సు నుంచి దిగుతున్న కండక్టర్‌ మంగేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. ఆయన కాలు విరగ్గొట్టారు. స్థాని­కులు, డ్రైవర్‌.. కండక్టర్‌ను మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. దీనిపై అంగర పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టినా నిందితులు అధికార పార్టీకి చెందిన వారు కావ డంతో పోలీసులు చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. 

పైగా, మంగేశ్వరరావుకు మెరుగైన వైద్యం అందించకుండా కాలయాపన చేస్తున్నారు. దీనిపై ఆర్టీసీ కారి్మకులు జేఏసీగా ఏర్పడి సోమవారం గేట్‌ మీటింగ్‌ పెట్టి నిరసన తెలిపారు. బాధిత కండక్టర్‌ కాలుకు తక్షణం శస్త్రచికిత్స చేయించాలని, ఘటన జరిగినప్పటి నుంచి ఆయన కోలుకునేవరకు ఆన్‌డ్యూటీగా పరిగణించాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కారి్మకులు డిమాండ్‌ చేశారు.  ఈ మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్‌ పేపకాయల భాస్కరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యునైటెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కేఎస్‌సీ రావు, ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిపో సెక్రటరీ ఎల్‌.నారాయణ, నేషనల్‌ యూనిటీ అసోసియేషన్‌ సెక్రటరీ ముత్యాలరావు, వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధి జీఎస్‌ రాజు, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్దూ పాల్గొన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)