పోలీసులకు హైకోర్టు షాక్‌

Published on Tue, 08/12/2025 - 03:04

సాక్షి, అమరావతి: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్‌సీపీ కీలక నేతలు లింగాల రామలింగారెడ్డి, నంద్యాల హేమాద్రిరెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద తప్పుడు కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులకు హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చిం ది. వీరిపై నమోదైన కేసులో తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సోమవారం ఆదేశించింది.  ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఉత్తర్వులు జారీచేశారు.

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం చేస్తున్న తమపై వైఎస్సార్‌సీపీ నేతలు లింగాల రామలింగారెడ్డి, మరికొందరు దాడి­చేసి గాయపరిచారంటూ టీడీపీకి చెందిన ధనుంజయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రామలింగారెడ్డి, హేమాద్రిరెడ్డితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారు. ఇది కొట్టేయాలని కోరుతూ రామలింగారెడ్డి, హేమాద్రిరెడ్డిలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ జ్యోతిర్మయి విచారణ జరిపారు. 

ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదు.. 
పిటిషనర్ల తరఫు న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పిటిషనర్లపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గొడవ జరిగితే, దానిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేయడం చెల్లదన్నారు. పైగా.. బాధితుడు ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి అయితేనే ఆ చట్టం కింద కేసు పెట్టడానికి వీలుంటుందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనకుండా చేసేందుకే పిటిషనర్లపై పోలీసులు ఈ తప్పుడు కేసు నమోదుచేశారన్నారు.

అనంతరం.. పోలీసుల తరఫున  పీపీ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.  ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో లోతుగా విచారణ జరపాల్సి ఉందన్నారు. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని పిటిషనర్లపై తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేశారు. ఈలోపు ఫిర్యాదుదారు ధనుంజయకు నోటీసులు అందజేయాలని పీపీకి సూచించారు.

Videos

గుర్తుపెట్టుకో అనిత.. మేమిచ్చే రిటర్న్స్ గిఫ్ట్ కి దిమ్మతిరిగి బొమ్మ కనపడుద్ది

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు

వీళ్లు అసలు పోలీసులా రౌడీలా... YSRCP నేతలపై దాడులు.. సజ్జల స్టాంగ్ రియాక్షన్

అర్ధరాత్రి కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పల్నాడులో హైటెన్షన్...

ఏపీలో నేటి నుంచి పరిషత్ పోరు.. నామినేషన్ల వేళ టెన్షన్!

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

నన్ను చంపితే 2028లోపే చంపండి.. 2029 మాత్రం మీకు చుక్కలే

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

Photos

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!