Breaking News

నీట మునిగిన ‘ఏపీ రాజధాని’

Published on Wed, 08/13/2025 - 19:49

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి నీట మునిగింది. అమరావతి కోర్ క్యాపిటల్ వరద ముంపులో చిక్కుకుంది. అమరావతి రాజధాని గ్రామాలు వర్షానికి మునిగాయి.  ఏపీ రాజధాని అమరావతి.. కృష్ణా నదిని తలపిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంది.  కొండవీటి వాగు, పాలవాగు పొంగిపొర్లుతుంది. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతోంది. దీంతో కనుచూపుమేరలో రాజధానిలో భూమి కనిపించడం లేదు.

వేల ఎకరాలు భూములు నీటమునిగాయి. నీరుకొండ వద్ద వర్షపు నీరు గంట గంటకు పెరుగుతోంది. శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయ పాలెం, నీరుకొండ, కురగల్లు, ఎర్రబాలెం, పెనుమాక, బేతపూడి పొలాల్లోకి వరద నీరు చేరింది. ఎస్‌ఆర్‌ఏం యూనివర్సిటీ చుట్టూ భారీగా వరద నీరు చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు మార్గం జలమయంగా మారింది. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు పెరుగుతోంది. పొంగి ప్రవహిస్తున్న కొండవీటి వాగు, పాలవాగుతో వేలాది ఎకరాల నీటమునిగాయి.

ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా పోటెత్తుతోంది. దీంతో అధికారులు.. మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలతో డ్రైనేజీలు, మ్యాన్‌ హోల్స్‌ పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గుంటూరు, తాడికొండ మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి. మంగళగిరిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.

నీట మునిగిన అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం
అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం కూడా నీట మునిగిపోయింది. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ వరద నీరు చేరింది. రాయపూడిలో ఐకానిక్‌ టవర్ నిర్మాణం అవుతోంది. అమరావతి ఐకానిక్ టవర్ ప్రాంతం చెరువులా మారిపోయింది.


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)