Breaking News

ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు

Published on Tue, 06/11/2024 - 11:56

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో.. కూటమి నేతగా ఎన్నికైన తర్వాత  ఆయన మాట్లాడుతూ రాజధాని అంశం మీద మాట్లాడారు. 

 "14 ఏళ్లుగా సీఎంగా ఉన్నాను, 15 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నాను. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాం. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి ఉంటుంది. అలాగే విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తాం. అమరావతిని అభివృద్ధి చేస్తాం. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేస్తాం. స్టేట్‌ ఫస్ట్‌ అనే నినాదంతో ప్రజాహితం కోసం ముందుకెళ్తాం. మూడు ప్రాంతాల అభివృద్ధి చేయడమే మా అజెండా అని అన్నారు."

"ఎన్డీయే శాసనాసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ప్రజల తీర్పును కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందరూ కలిసి పని చేయడం వల్ల కూటమికి 57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ తీర్పు వల్ల మనకు ఢిల్లీలో ప్రతిష్ట పెరిగింది. నేను జైల్లో ఉన్నప్పుడు పవన్‌ నన్ను పరామర్శించి పొత్తు పెట్టుకుందామని చెప్పారు. బీజేపీతో ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పని చేయడం వల్ల సీట్లు, ఓట్లు వచ్చాయి"

అలాగే తన కోసం రాష్ట్రంలో ఎక్కడా ట్రాఫిక్‌ ఆపొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేను, పవన్‌ సామాన్యులమే. ప్రజాస్వామ్యయుతంగా పని చేస్తాం అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు.. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు పేరును పవన్‌ కల్యాణ్‌ ప్రతిపాదించగా.. దానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆమోదం తెలిపారు. ఆ వెంటనే టీడీపీ-జనసేన-బీజేపీ  ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా చంద్రబాబును తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు.

సీఎం చంద్రబాబు.. ఏకగ్రీవం

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)