వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్‌.. చిప్పగిరిలో ఉద్రిక్తత

Published on Sun, 08/02/2026 - 07:01

సాక్షి, కర్నూలు: కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా అక్రమ అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో శనివారం అర్ధరాత్రి పోలీసులు హైడ్రామాకు తెరలేపారు. వైఎస్సార్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్ట్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటికి రాత్రి 2.45 గంటలకు భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగులగొట్టి ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం వారిద్దరినీ చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో సీసీ కెమెరా హార్డ్‌ డిస్కులను పోలీసులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చిప్పగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

అయితే, టీడీపీ నాయకుడు నాగరాజు వైఎస్సార్‌సీపీ నేత గిరి ఇంటిపై దాడికి తెగబడితే ఎమ్మెల్యే వీరుపాక్షి పరామర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ గూండాలు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  విరుపాక్షి సోదరుడు శ్రీరాముడికి గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ నాయకులపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోనలేదు. అంతటితో ఆగకుండా గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ విరుపాక్షిపై  సీఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారు. అనంతరం, ఎమ్మెల్యే నివాసానికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు.. దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించిన విరూపాక్షి, చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారు. 
 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)