Breaking News

తల్లికి వందనంలో భారీ కోతలు

Published on Thu, 07/16/2026 - 18:27

సాక్షి,అమరావతి: రాష్ట్ర విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం భారీ షాకిచ్చింది. తల్లికి వందనం పథకంలో భారీగా కోతలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15,000 ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కారు. 

ఈ ఏడాది కూడా తల్లుల ఖాతాల్లో కేవలం రూ.13,000 మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్ నిర్వహణ (మెయింటెనెన్స్ ఫండ్) పేరుతో ప్రతి విద్యార్థి డబ్బుల నుండి రూ.2,000 ముందస్తు కోత విధించింది. గతేడాదికూడా ఇలాగే రూ.2,000 కోత పెట్టి, ఆ నిధులను స్కూళ్లకు కేటాయించని ప్రభుత్వం.. ఈ ఏడాది మళ్లీ అదే దారిలో పయనిస్తూ రూ.2,000 కోత పెట్టడం గమనార్హం. ఇలా మొత్తంగా మూడేళ్ల కాలంలో ఒక్కో విద్యార్థికి ఏకంగా రూ.19,000 లబ్ధిని ప్రభుత్వం ఎగనామం పెట్టింది.

ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ వర్తింపజేస్తామని చంద్రబాబు హామీలు గుప్పించారు. కానీ, ఇప్పుడు క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఏకంగా 14 రకాల కఠినమైన షరతులు, నిబంధనలను తెరపైకి తెచ్చారు. ఈ కొరడా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ ఆంక్షలన్నింటినీ దాటుకుని రాష్ట్రవ్యాప్తంగా కేవలం 67,47,190 మంది విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా తేలడంతో, ఆ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)