Breaking News

న్యాయ సాయం కోరే హక్కు నిందితునికి ఉంది

Published on Sat, 11/30/2024 - 08:09

సాక్షి, అమరావతి : ఏదైనా కేసులో నిందితుడిని పోలీసులు పీటీ వారెంట్‌ మీద మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచినప్పుడు, అతను పోలీసు లేదా జ్యూడిషియల్‌ కస్టడీని వ్యతిరేకిస్తూ తనకు న్యాయ సాయం అందించాలని  మేజిస్ట్రేట్‌ను కోరవచ్చని హైకోర్టు తెలిపింది. అలా కోరే హక్కు నిందితుడికి ఉందని స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్‌లు నిందితుడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి అని అభిప్రాయపడింది. సోషల్‌ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్‌కు హైకోర్టు ఈ వెసులుబాటుని ఇచ్చింది. 

రవికిరణ్‌కు సంబంధించి  వివరాలేమీ పోలీసులు తమకు తెలియజేయడంలేదని, దీంతో న్యాయ సాయం పొందే అవకాశం లేకుండా పోతోందన్న అతని తరఫు న్యాయవాది వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే రవికిరణ్‌పై నమోదైన కేసుల వివరాలును తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పీటీ వారెంట్ల వివరాలను పోలీసులు నిందితునికి తెలియచేయాల్సిన పని లేదని తెలిపింది. 

తదుపరి విచారణను డిసెంబర్‌ 9కి వాయిదా వేసింది. తన భర్త రవికిరణ్‌పై ఉన్న కేసుల వివరాలు, పీటీ వారెంట్లపై పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదంటూ ఇంటూరి సుజన హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరి­పిన న్యాయమూర్తి జస్టిస్‌ వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సుజన తరఫున న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, పోలీసుల తరపున  ప్రభుత్వ న్యాయవాది (హోం) ఎ.జయంతి వాదనలు వినిపించారు.  

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)