Breaking News

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఉద్యమ బాట!

Published on Thu, 01/30/2025 - 04:48

సాక్షి, అమరావతి/గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రేషనలైజేషన్‌ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదించాలని నిర్ణయించిన కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. 20కి పైగా ఉద్యోగ సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. మూడు రోజుల క్రితం సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. 1.34 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశంపై ఒక కమిటీ వేసి.. సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా రేషనలైజేషన్‌ నిర్ణయం తీసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. 

ప్రభుత్వం మారినప్పుడల్లా జాబ్‌ చార్ట్‌ మార్చేస్తారా?
ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసి గ్రామ స్వరాజ్యానికి సిసలైన అర్థం చెబుతూ ఐదేళ్ల క్రితం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా విప్లవాత్మక వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ వ్యవస్థను బలహీనపరిచే దిశగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న రేషనలైజేషన్‌ నిర్ణయంతో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్‌ అంటూ కేటగిరీలుగా వర్గీకరించడం వల్ల.. తమ విధులు పూర్తిగా మారే అవకాశం ఉందంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వం మారగానే జాబ్‌ చార్ట్‌ మారుతుంటే తమలో అభద్రతా భావం పెరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 అక్టోబర్‌ నాటికి ఉద్యోగాల్లో చేరిన వారికి అప్పటి ప్రభుత్వం స్పష్టమైన జాబ్‌ చార్ట్‌ ప్రకటించడంతో పాటు పదోన్నతుల ప్రక్రియను కూడా నిర్ధారించింది. అలాగే కొంత మంది పదోన్నతులు కూడా పొందారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రేషనలైజేషన్‌ పేరుతో మార్పులు చేయడం వల్ల.. జాబ్‌చార్ట్‌ పూర్తిగా మారిపోయి.. పదోన్నతుల ప్రక్రియకు భంగం కలిగే అవకాశం ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే లక్ష్యం తప్ప.. రేషనలైజేషన్‌ ప్రక్రియలో ఎక్కడా తమ సంక్షేమం గురించిన ఆలోచన కనిపించలేదని వారు మండిపడుతున్నారు. 

ఉద్యోగ సంఘాలతో చర్చించాలి..
ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే రేషనలైజేషన్‌ ప్రక్రియపై తదుపరి నిర్ణ­యాలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎండీ జానీ పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు కోరారు.  

ఉత్తర్వులను రద్దు చేయాల్సిందే..
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్‌కు సంబంధించి.. సిబ్బంది అభిప్రాయాలు సేకరించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులివ్వడం దారుణమని గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉద్యోగులంతా భయాందోళనకు, అభద్రతకు గురవుతున్నారని తెలిపారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులనుద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘రేషనలైజేషన్‌ పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు సచివాలయాల ఉద్యోగులను గందరగోళంలోకి నెట్టింది. రేషనలైజేషన్‌ను మేము వ్యతిరేకించడం లేదు. ప్రభుత్వం చేపట్టే మార్పులు ఉద్యోగుల సమస్యలను పెంచే విధంగా కాకుండా.. వాటిని పరిష్కరించే విధంగా ఉండాలి. ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోతే సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలకు సిద్ధమవ్వాలి’ అని వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)