Breaking News

భారత్‌–యూఏఈ మధ్య ‘ఫుడ్‌ కారిడార్‌’

Published on Tue, 10/08/2024 - 06:27

ముంబై: భారత్‌–యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ) దాదాపు రెండు  బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఫుడ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నాయి.  ఈ క్యారిడార్‌ యూఏఈ ఆహార అవసరాలను తీర్చడంతోపాటు, అంతకుమించి భారతీయ రైతులకు అధిక ఆదాయాన్ని సంపాదించడానికి, దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పియుష్‌ గోయల్‌ తెలిపారు. 

పెట్టుబడులపై భారత్‌–యూఏఈ అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ 12వ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో గోయల్‌ ఈ విషయాలు చెప్పారు. ఈ సమావేశానికి గోయల్‌తో పాటు అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ ఎండీ షేక్‌ హమీద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నాహ్యాన్‌ కో–చెయిర్‌గా వ్యవహరించారు. స్థానిక కరెన్సీలో ద్వైపాక్షిక వాణిజ్యంతో పాటు వర్చువల్‌ ట్రేడ్‌ కారిడార్‌ పనులు, అహ్మదాబాద్‌లో ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు మొదలైన అంశాలపై ఇందులో చర్చించారు.  ఈ సందర్భంగా గోయల్‌ ఏమి చెప్పారంటే... 

→ రెండు దేశాల మధ్య ఫుడ్‌ కారిడార్‌ స్థాపనను ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు– యూఏఈతో కూడిన చిన్న వర్కింగ్‌ గ్రూప్‌ కూడా ఇప్పటికే ఏర్పాటయ్యింది. 
→ భారతదేశంలో ఫుడ్‌ పార్కుల ఏర్పాటు గురించి  చర్చించిన అంశాల్లో మరొకటి. ఇప్పటికే ఈ విషయంలో కొంత పురోగతి జరిగింది. రైతులకు అధిక ఆదాయంతోపాటు లక్షలాది మందికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో ఉద్యోగాలు కల్పించడానికి సహాయపడే అంశమిది.  అలాగే యూఏఈ ఆహార భద్రతకు కూడా దోహదపడుతుంది.  
→ ఫుడ్‌ క్యారిడార్‌ పెట్టుబడి వచ్చే రెండున్నరేళ్ల కాలంలో జరుగుతుందని అంచనా.  
→ యూఏఈకి అనువైన అధిక నాణ్యతా ఉత్పత్తుల లభ్యత కోసం దేశంలో యూఏఈ భారీ పెట్టుబడులతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సదుపాయాలను మెరుగుపరచాలన్నది గత ఎంతోకాలంగా చర్చిస్తున్న అంశం. ఇది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది.  
→ తాజా పరిణామంతో దేశీయ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమతో ఇతర గల్ప్‌ మార్కెట్లూ అనుసంధానమయ్యే అవకాశం ఉంది.  

దుబాయ్‌లో ఇన్వెస్ట్‌ ఇండియా కార్యాలయం
భారత్‌లో పెట్టుబడులు చేయదల్చుకునే మదుపర్లకు సహాయకరంగా ఉండేలా దుబాయ్‌లో ఇన్వెస్ట్‌ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు పియుష్‌ గోయల్‌ ఈ సందర్భంగా  తెలిపారు. అలాగే, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌కి (ఐఐఎఫ్‌టీ) సంబంధించి విదేశాల్లో తొలి క్యాంపస్‌ను కూడా దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో (యూఏఈ) నివసించే 35 లక్షల మంది భారతీయులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)