Breaking News

చీరాలలో టీడీపీ, కాంగ్రెస్‌ బరితెగింపు

Published on Tue, 05/14/2024 - 06:06

చీరాల టౌన్‌/చీరాల: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్‌ అనుచరులు జరిపిన దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం గవినివారిపాలెం పోలింగ్‌ కేంద్రానికి కొండయ్య యాదవ్‌ అనుచరులతో వచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేశారు. దీన్ని రాష్ట్ర అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గవిని శ్రీనివాసరావు అడ్డుకోవడంతో ఆయనపై కొండయ్య దురుసుగా ప్రవర్తించారు. ఇదే అదనుగా ఆయన అనుచరులు రాడ్లు, కర్రలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చితకబాదారు.

పోలీసుల కళ్లముందే ఇదంతా జరుగుతున్నా చీరాల రూరల్‌ సీఐ సత్యనారాయణ, డీఎస్పీ బేతపూడి ప్రసాద్‌ చోద్యం చూస్తున్నారే తప్ప అడ్డుకోవడానికి యత్నించలేదు. పైగా దాడిలో గాయపడిన చీదరబోయిన రమణమ్మ, మరో ముగ్గురిని బలవంతంగా పక్కకు నెట్టేశారు. గవిని శ్రీను, మరో నలుగురు వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసు జీపులో ఎక్కించుకుని పక్కకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడకు చేరు­కున్న కొండయ్య కుమారుడు మహేంద్ర, అతని అను­చరులు కర్రలతో వచ్చి భయభ్రాంతులకు గురి­చేశారు. చివరకు డీఎస్పీ బేతపూడి ప్రసాద్‌ రంగంలోకి దిగి కొండయ్యను బతిమిలాడి అక్కడి నుంచి పంపించేశారు. ఆ తరువాత పిట్టువారిపాలెం పోలింగ్‌ కేంద్రం వద్ద కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తూ టీడీపీకి ఓట్లు వేయకపోతే అందరి అంతూ చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. 

కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి దౌర్జన్యం
చీరాల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీ అభ్యర్థి కొండయ్య గెలవాలనే లక్ష్యంతో వైఎస్సార్‌ సీపీ నేత బలగంశెట్టి అంకమ్మరావుపై దాడికి దిగారు. రెడ్డిపాలెం పోలింగ్‌ కేంద్రం వద్ద అంకమ్మరావు ప్రజలకు నమస్కరిస్తూండగా కారులోంచి దిగిన ఆమంచి దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఆయన చీరాల ఏరియా వైద్యశాలలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కరణంపై ఆమంచి దాడి
చీరాల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ తన అనుచరులతో కలసి బీభత్సం సృష్టించారు. ఎన్నికల ప్రక్రియ పరిశీలించేందుకు పట్టణంలోని ఏడో వార్డుకు సోమవారం సాయంత్రం వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్‌ను కులం పేరుతో దూషించి, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తన అనుచరులతో కలసి దాడికి తెగబడ్డారు. వెంకటేష్‌ కారు అద్దాలు పగులకొట్టించారు. అంతటితో ఆగకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చీరాల వన్‌టౌన్, టూటౌన్‌ సీఐలు పి.శేషగిరిరావు, సోమశేఖర్‌ ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమంచి వర్గీయులను అక్కడ నుంచి పంపించి వేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)