Breaking News

Lok Sabha Election 2024: మహిళలకు ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ: సోనియా

Published on Tue, 05/14/2024 - 05:50

న్యూఢిల్లీ: ప్రస్తుత కష్టకాలంలో మహిళలు పడుతున్న అవస్థలను కాంగ్రెస్‌ పార్టీ తొలగిస్తుందని, ఇదే పార్టీ గ్యారెంటీ అని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ చెప్పారు. ఈ మేరకు సోమవారం సోనియా ఒక వీడియో సందేశం ఇచ్చారు. ‘‘ ప్రియమైన సోదరీమణులారా..  మహిళలు దేశ స్వాతంత్రోద్యమం నుంచి నవభారత నిర్మాణం దాకా తమ వంతు అద్భుత తోడ్పాటునందించారు. అయితే మహిళలు ప్రస్తుతం ద్రవ్యోల్బణం మాటున సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మహిళల కష్టానికి సరైన న్యాయం దక్కేలా కాంగ్రెస్‌ విప్లవాత్మకమైన గ్యారెంటీని ఇస్తోంది. కాంగ్రెస్‌ మహాలక్ష్మీ పథకం ద్వారా పేద కుటుంబంలోని మహిళకు ఏటా రూ.1లక్ష సాయం అందించనుంది. 

ఇప్పటికే అమలవుతున్న పథకాలతో కర్ణాటక, తెలంగాణలో ప్రజల జీవితాలు మెరుగయ్యాయి. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, ఆహార భద్రతా చట్టాలలాగే కాంగ్రెస్‌ తాజాగా కొత్త పథకాన్ని ముందుకు తేనుంది. కష్టకాలంలో ఎల్లప్పుడూ కాంగ్రెస్‌ ఆపన్నహస్తం అందిస్తుంది’ అని ముగించారు. సోనియా సందేశాన్ని కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే, రాహుల్‌ గాం«దీ ‘ఎక్స్‌’లో షేర్‌చేశారు. సోనియా సందేశంపై రాహుల్‌ స్పందించారు. ‘‘ పేద కుటుంబాల మహిళలు ఒక్కటి గుర్తుంచుకోండి. మీ ఒక్క ఓటు ఏటా మీ ఖాతాలో జమ అయ్యే రూ.1 లక్షతో సమానం. పెరిగిన ధరవరలు, నిరుద్యోగ కష్టాల్లో కొట్టుమిట్లాడుతున్న పేద మహిళలకు మహాలక్ష్మీ పథకం గొప్ప చేయూత. అందుకే ఓటేయండి’ అని అన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)