More

సమ్మె పట్టు తప్పుతోంది..!

19 Jun, 2017 02:48 IST

పాల్గొనాలని కార్మిక సంఘాల ఇంటింటి ప్రచారం
 
రుద్రంపూర్‌ (భద్రాద్రి కొత్తగూడెం): సింగరేణిలో సమ్మె ప్రభావం క్రమంగా తగ్గుతోంది. రోజురోజుకీ విధులకు హాజరయ్యే కార్మికుల శాతం పెరుగు తోంది. ఆదివారం ప్లేడేగా యాజమాన్యం ప్రకటించడంతో 53.09 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. ఆదివారం కొత్తగూడెం ఏరియాలో అధికారులు ఉత్తమ కార్మికులతో కలసి విధుల్లో పాల్గొనా లంటూ ప్రచారం నిర్వహించారు. ఇల్లెందు ఏరియాలో ఏఐటీయూసీ, సీఐ టీయూ నాయకులు కార్మికుల ఇళ్లకు వెళ్లి సమ్మెలో పాల్గొనాలని కోరారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి వారసత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఈనెల 15 నుంచి సమ్మెలోకి దిగాయి. 
 
సగటు కన్నా పెరిగిన ఉత్పత్తి : సింగరేణి యాజమాన్యం
సాక్షి, మంచిర్యాల: సింగరేణిలో సమ్మె ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని, సెలవు దినమైన ఆదివారం కూడా సమ్మెపై కార్మికుల్లో స్పందన లేదని సింగరేణి యాజ మాన్యం తెలిపింది. సాధారణ హాజరుతో పోలిస్తే సెలవుదినమైన ఆదివారం 77 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారని వివరించారు.  
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

మొత్తం ఓటర్లు  3.26 కోట్లు

రాబోయే వ్యాధులకు ముందే చెక్‌!

ఆగం కావొద్దు

బీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తే నిరుద్యోగులది అడవి బాటే