Breaking News

సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌.. ఒక్కొక్కరికి ఎంతంటే!

Published on Fri, 10/20/2023 - 16:48

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు దసరా జోష్‌ నెలకొంది. సింగరేణి లాభాల వాటాను కార్మికుల ఖాతాలో జమ చేసేందుకు అడ్డంకి తొలగింది. పండుగకు మూడు రోజుల ముందే కార్మిక ఖాతాల్లో సింగరేణి యాజమాన్యం నగదు జమ చేయనుంది. ఒక్కొక్కరికి రూ. 1.53 లక్షల చొప్పున 42 వేల మంది కార్మికులకు లాభాల వాటాను జమ చేయనుంది. ఈ మేరకు ద‌స‌రా బోన‌స్‌గా రూ. 711 కోట్లు విడుదల చేసింది.

శనివారం దసరా పండగ అడ్వాన్స్ కూడా సింగరేణి సంస్థ చెల్లించనుంది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ గతేడాది సాధించిన రూ.2,222.46 కోట్ల లాభంలో 32 శాతాన్ని దసరా పండుగకు ముందే చెల్లించ‌నున్న‌ట్టు సింగ‌రేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్‌ అందనున్నట్లు ఆయన చెప్పారు.
చదవండి: Video: చెక్‌పోస్టు కారు బీభత్సం.. కానిస్టేబుల్‌ను ఢీకొట్టి..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)