Breaking News

వారం పాటు మాస్క్‌లపై కరోనా వైరస్‌

Published on Mon, 04/06/2020 - 15:26

బీజింగ్‌: ప్రపంచ దేశాలన్ని కరోనా మహమ్మారి బారిన పడి కకావికలమవుతున్నాయి. ఎప్పుడూ ప్రపంచం చూడనంతగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారికి ఎటువంటి మందు కానీ, వాక్సిన్‌ కానీ కనిపెట్టలేదు. ఈ వైరస్‌ను ఎదుర్కోవాలంటే తరచు చేతులు కడుక్కోవడం, మాస్క్‌లు ధరించడం, ఇంటిని, పరిసరాలను క్రిములు వ్యాప్తిచెందకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం లాంటి స్వీయ రక్షణ చర్యలు మాత్రమే మార్గాలు. అయితే హాంకాంగ్‌ యూనివర్శిటి వాళ్లు కరోనా వైరస్‌ పై జరిపిన రీసెర్చ్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 

కరోనా వైరస్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, ప్లాస్టిక్‌ ఉపరితలాలపై 4రోజుల వరకు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా కరోనా నుంచి రక్షణ కోసం ఉపయోగించే మాస్క్‌లపై మాత్రం కరోనా వైరస్‌ వారం రోజుల పాటు ఉంటుందని హాంకాంగ్‌ యూనివర్శిటి పరిశోధకులు తెలిపారు. మాస్క్‌ ముందు భాగాన్ని చేతితో తాకితే ఆ వైరస్‌ చేతికి అంటుకొని దాని ద్వారా ముఖాన్ని, కళ్లను, ముక్కును తాకినప్పుడు మనం వైరస్‌ బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. అందుకే చేతులు కడుక్కున్న తరువాతే ముఖాన్ని కానీ, కళ్లను కానీ ముట్టుకోవాలని సూచిస్తున్నారు. (కరోనాకు విరుగుడు అదేనా?)

గది ఉష్ణోగ్రత వద్ద ఏఏ వస్తువులపై కరోనా వైరస్‌ ఎంత సేపు ఉంటుందని పరిశోధనలు చేశారు. దీనిలో భాగంగా ప్రింటింగ్‌ పేపర్‌, టిష్యూ పేపర్‌ల మీద కరోనా వైరస్‌ కేవలం మూడు గంటలు మాత్రమే ఉంటుందని కనుగొన్నారు. చెక్క మీద, బట్టల మీద రెండో రోజుకు కనిపించకుండా పోతుందని, గ్లాస్‌ మీద, బ్యాంక్‌ నోట్ల మీద రెండురోజుల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మాస్క్‌ల మీదే అత్యధికంగా వారం రోజుల పాటు కరోనా వైరస్‌ ఉంటుందని వారు తెలిపారు. కరోనాను ఎదుర్కొవడానికి తరచు చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ఒక్కటే మార్గమని వారు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షలకు పైగా కరోనా బారిన పడగా 70 వేల మందికి పైగా మృతి చెందారు.  ( వైరస్‌ బారిన 26 మంది నర్సులు, డాక్టర్లు)

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)