Breaking News

కుంకుమ పువ్వు గురించి ఈ విషయాలు తెలుసా..!

Published on Sun, 11/29/2026 - 09:32

వంటకాల్లో ఉపయోగించే అత్యంత ఖరీదైన సుగంధద్రవ్యం కుంకుమపువ్వు. ఈ పువ్వులను జాగ్రత్తగా చేత్తో కోసి, వాటి నుంచి పుప్పొడికాడలను వేరుచేసి ఎండబెట్టి, వంటకాల్లో ఉపయోగించడానికి అనువుగా సిద్ధం చేస్తారు. కుంకుమపువ్వును వంటకాల్లోనే కాకుండా, సంప్రదాయ వైద్యపద్ధతుల్లో ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. కిలో కుంకుమపువ్వు కోసం దాదాపు లక్షన్నర నుంచి రెండులక్షల పువ్వులు అవసరం అవుతాయి. 

ప్రపంచవ్యాప్తంగా కుంకుమపువ్వు ఉత్పాదనలో మన దేశం మూడో స్థానంలో ఉంది. మన దేశంలోని జమ్ము కశ్మీర్‌లో కుంకుమపువ్వు సాగు అత్యధికంగా జరుగుతోంది. హిమాలయాలకు చేరువలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోనూ కుంకుమపువ్వు సాగు చేస్తున్నారు. కుంకుమపువ్వు విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం...

కుంకుమపువ్వు ఉత్పాదనలోనూ, ఎగుమతుల్లోనూ ఇరాన్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఉత్పాదనలో మన దేశం మూడో స్థానంలో ఉన్నా, ఎగుమతుల్లో కొంత వెనుకబడి ఐదో స్థానంలో ఉంది. కుంకుమపువ్వు ఎగుమతుల వివరాలు గణాంకాల్లో...

మరిన్ని విశేషాలు
కుంకుమపువ్వు సాధారణంగా అక్టోబర్‌ నెలాఖరు నుంచి నవంబర్‌ మధ్య కాలంలో పూస్తుంది. పూత పూసినప్పుడు కుంకుమపువ్వు రైతులకు తీరికలేనంతగా పని ఉంటుంది. సాధారణంగా రెండు మూడు వారాల్లో పూత అత్యధికంగా ఉంటుంది. పూసిన వెంటనే వీటిని ఎప్పటికప్పుడు చేత్తో సున్నితంగా కోయాల్సి ఉంటుంది. కోసిన పువ్వుల నుంచి పుప్పొడి కాడలను వేరు చేసి, ఎండబెట్టాల్సి ఉంటుంది. ఎండిన పుప్పొడికాడలనే వంటకాల్లోను, ఔషధాల తయారీలోను ఉపయోగిస్తారు.

ఒక గ్రాము కుంకుమపువ్వు కోసం దాదాపు 150–200 వరకు పూలను కోయాల్సి ఉంటుంది.

పూలలో ఉండే మూడు పుప్పొడి కాడలను జాగ్రత్తగా వేరు చేయాలి.

తాజా పుప్పొడి కాడలను ఎండబెట్టే ప్రక్రియలో బరువు గణనీయంగా తగ్గుతుంది. దాదాపు ఐదు కిలోల తాజా పుప్పొడి కాడలను ఎండబెడితే, పూర్తిగా ఎండిన తర్వాత కిలో బరువుకు చేరుతుంది.

ఒక హెక్టారు విస్తీర్ణంలో కుంకుమపువ్వు సాగు చేస్తే, వచ్చే దిగుబడి 8–15 కిలోల వరకు మాత్రమే ఉంటుంది.

కుంకుమపువ్వు సేకరణ, వాటి నుంచి తుది ఉత్పత్తిని సిద్ధం చేయడం చాలా వ్యయప్రయాసలతో కూడిన పని. సాగు విస్తీర్ణంతో పోల్చుకుంటే, దిగుబడి చాలా తక్కువ. అతిశీతల వాతావరణంలో మాత్రమే సాగు చేయడానికి వీలుంటుంది. ఈ కారణాల వల్లనే కుంకుమపువ్వు అత్యంత ఖరీదైన సుగంధద్రవ్యంగా ఉంటోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో కుంకుమపువ్వు ధర కిలో 2,500 డాలర్ల వరకు పలుకుతోంది.

ఇదీ చదవండి: బీచ్‌లో ప్రియురాలికి ప్రపోజ్‌ చేస్తుండగా..హఠాత్తుగా రాకాసి అల..!
 

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)