Breaking News

AI ఎఫెక్ట్.. 2.4 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం?

Published on Sun, 11/29/2026 - 08:14

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే అనేక రంగాల్లో ఏఐ ఆధారిత టెక్నాలజీతో పనులు జరుగుతున్నాయి. అయితే.. ఈ పరిణామం ఉద్యోగుల భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఏఐ రాకతో లక్షలాది ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందనే చర్చ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా.. జేపీ మోర్గాన్ వెల్త్ మేనేజ్‌మెంట్ విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.

నివేదిక ప్రకారం.. రానున్న ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.4 కోట్ల మంది నాలెడ్జ్ వర్కర్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కంపెనీలు ఉద్యోగులు చేసే పనులను ఏఐతో చేయించేందుకు ప్రాధాన్యత ఇస్తే.. ఈ పరిస్థితి వస్తుందని సమాచారం. అయితే.. దీనర్థం ఏఐ వల్ల ఉద్యోగాలన్నీ ఒకేసారి పోతాయని కాదు, సంస్థలు తమ పని విధానాలను మార్చుకోవడం వల్ల ఉద్యోగుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.

ఏటా 1.3 శాతం ఉద్యోగులపై ప్రభావం?
జేపీ మోర్గాన్ అంచనా ప్రకారం.. వచ్చే ఐదేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్ వర్క్‌ఫోర్స్‌లో ఏటా సుమారు 1.3 శాతం మంది ఉద్యోగ కోతల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది.

దీనికి ప్రధాన కారణం.. కంపెనీలు ఏఐపై పెట్టే పెట్టుబడులను.. ఉద్యోగుల స్థానంలో టెక్నాలజీని ఉపయోగించేందుకు మళ్లించడమే. ఏఐ కోసం చేసే ఖర్చులో సగం మొత్తాన్ని కొత్త ఉద్యోగుల నియామకానికి బదులుగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల పనులను ఆటోమేట్ చేయడానికి వినియోగిస్తే ఈ పరిస్థితి రావచ్చని నివేదిక అంచనా వేసింది.

అమెరికాలోనే 1.6 కోట్ల మందికి ముప్పు?
ఏఐ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అంచనా వేస్తున్న ఉద్యోగ నష్టాల్లో దాదాపు మూడింట రెండొంతుల వాటా అమెరికాలోనే ఉండవచ్చని నివేదిక తెలిపింది. ఈ లెక్కన రానున్న ఐదేళ్లలో అమెరికాలో సుమారు 1.6 కోట్ల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అంటే సగటున ఏడాదికి దాదాపు 30 లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. అమెరికాలోని మొత్తం పేరోల్ ఉద్యోగాల్లో ఇది ఏటా సుమారు 2 శాతానికి సమానమని నివేదిక అంచనా వేసింది.

ఉద్యోగాలు పూర్తిగా పోతాయా?
ఏఐ రాకతో అన్ని ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయని భావించాల్సిన అవసరం లేదని జేపీ మోర్గాన్ నివేదిక స్పష్టం చేసింది. ఎందుకంటే.. ఒక ఉద్యోగంలో అనేక రకాల పనులు ఉంటాయి. వాటిలో కొన్ని పనులను మాత్రమే ప్రస్తుతం ఏఐ సమర్థంగా నిర్వహించగలుగుతోంది. కాబట్టి.. ఉద్యోగాలను పూర్తిగా తొలగించడం కంటే, ఉద్యోగులు చేసే పనుల స్వరూపంలో మార్పులు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కొన్ని పనులను ఏఐకి అప్పగించి, మిగిలిన బాధ్యతలను ఉద్యోగులు నిర్వహించే విధానం పెరగవచ్చని తెలుస్తోంది.

ప్రారంభ దశలోనే వినియోగం
ఏఐ సామర్థ్యం ఎంత ఉన్నప్పటికీ, దాని వాస్తవ వినియోగం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని నివేదిక వెల్లడించింది. సిద్ధాంతపరంగా చూస్తే.. దాదాపు మూడింట రెండొంతుల పనులపై ఏఐ ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అమెరికాలో మొత్తం పని గంటల్లో కేవలం 6 శాతం సమయంలోనే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

ఏఐపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, వాటి నుంచి ఆశించిన స్థాయిలో ఉత్పాదకత పెరగాలంటే వినియోగాన్ని మరింత విస్తరించాల్సి ఉందని నివేదిక చెబుతోంది. ఏఐ కేవలం టెక్నాలజీ రంగానికే పరిమితం కాకుండా.. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇతర వ్యాపార రంగాల్లోనూ విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఇదీ చదవండి: వరుసగా 3 రోజులు బ్యాంకులు క్లోజ్.. డిసెంబర్ హాలిడేస్ లిస్ట్ ఇదే!

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)