Breaking News

పాత ఫార్మాట్‌ సినిమా అని ట్రోల్స్‌ చేస్తున్నారు: నాగచైతన్య

Published on Sat, 11/28/2026 - 17:44

తండేల్‌’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’. డిసెంబర్‌ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగచైతన్య చేసిని కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

ఆ రోజుల్లో అలా ఉండేది..
కమర్షియల్‌ సినిమాల కోసం ప్రస్తావించగా.. నాగచైతన్య తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘కమర్షియల్‌ సక్సెస్‌ అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. పదేళ్ల క్రితం ఇదే ప్రశ్న అడిగితే.. సినిమాలో ఐదు పాటలు, మూడు ఫైట్లు ఉండాలని చెప్పేవారు. అవి లేకపోతే అసలు అది సినిమానే కాదనేవారు. కానీ ఇప్పుడు ఐదు పాటలు ఎందుకు? సినిమా అంతా సాగదీయడం ఎందుకు? అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పుడు అలాంటి ఫైట్లు పెడితే సోషల్‌ మీడియాలో పాత  ఫార్మాట్‌ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

ఇప్పుడు లేదు
అందుకే అప్పట్లో కమర్షియల్‌ సినిమా అప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదు. ప్రేక్షకులు కొత్తదనం ఉన్న కథలను చూడాలనుకుంటున్నారు. నేను కూడా అలాంటి విభిన్నమైన కథతో విజయం అందుకుంటే అదే నాకు నిజమైన కమర్షియల్‌ సక్సెస్‌’ అని నాగచైతన్య చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: మట్టిలో మాణిక్యం.. ఒక్క పాటతో ఫేమస్‌..)

కాగా కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్పర్ష్‌ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)