Breaking News

పదేళ్లలో 27 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు 

Published on Thu, 11/26/2026 - 04:37

న్యూఢిల్లీ: గడిచిన పదేళ్ల పైగా వ్యవధిలో భారత్‌ నుంచి 27 బిలియన్‌ డాలర్ల పైచిలుకు ఈ–కామర్స్‌ ఎగుమతుల మైలురాయిని సాధించినట్లు ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వెల్లడించింది. అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్‌ ప్రోగ్రాంలో ఎగుమతిదారుల సంఖ్య 2.4 లక్షలకు చేరిందని, గతేడాదితో పోలిస్తే 20 శాతం పెరిగిందని పేర్కొంది. 2015లో ఈ ప్రోగ్రాంను ప్రారంభించగా .. ఇప్పటివరకు వంద కోట్లకు పైగా మేడిన్‌ ఇండియా ఉత్పత్తులను విక్రయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

2030 నాటికి 80 బిలియన్‌ డాలర్ల ఈ–కామర్స్‌ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించింది. వార్షికంగా చూస్తే మొత్తం ఎగుమతులు గతేడాదితో పోల్చినప్పుడు ఈ ఏడాది 7 బిలియన్‌ డాలర్ల మేర పెరిగినట్లు అమెజాన్‌ హెడ్‌ (భారత్‌లో అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్‌ విభాగం) శ్రీనిధి కల్వపూడి తెలిపారు. 

2024 ఆఖరున ఎగుమతులు 13 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, 2025 అక్టోబర్‌ నాటికి 20 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు వివరించారు. వినియోగ వస్తువుల (దుస్తులు, మొబైల్స్‌లాంటివి) ఎగుమతులకు గ్లోబల్‌ శక్తి కేంద్రంగా నిలిచే సత్తా భారత్‌కి ఉందని  చెప్పారు. ఈ ఆకాంక్షలకు వాస్తవ రూపం దాల్చేలా ఈ–కామర్స్‌ సహాయపడుతోందని, భారతీయ విక్రేతలు గ్లోబల్‌ ఎగుమతిదార్లుగా ఎదిగేందుకు అవకాశాలు కలి్పస్తోందని వివరించారు.  

బ్రిటన్‌ ఒప్పందంతో ప్రయోజనం .. 
భారత్‌–బ్రిటన్‌ మధ్య వాణిజ్య ఒప్పందం వల్ల టారిఫ్‌లు తగ్గుతాయి కాబట్టి దేశీయ విక్రేతలకు ప్రయోజనం చేకూరుతుందని శ్రీనిధి చెప్పారు. అయితే, దీన్ని పూర్తి స్థాయిలో మదింపు చేసేందుకు దాదాపు ఏడాది వ్యవధి పట్టేయొచ్చని వివరించారు. 

2027–28 బడ్జెట్‌పై స్పందిస్తూ.. ఈ–కామర్స్‌ ఎగుమతుల విషయంలో భిన్నమైన విధానాన్ని పాటించాలనే ఉద్దేశంతో కేంద్రం దీన్ని ప్రత్యేక కేటగిరీగా గుర్తించడం మొదలుపెట్టిందని ఆయన పేర్కొన్నారు. అమెజాన్‌ ప్రకటన ప్రకారం∙అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్‌ ప్రోగ్రాం కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పరిశీలిస్తే 36,000 మంది ఎగుమతిదారులతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్‌ (32,500 మంది పైగా), ఉత్తర్‌ప్రదేశ్‌ (29,000), గుజరాత్‌ (28,000), మహారాష్ట్ర (23,500 మంది పైగా) ఉన్నాయి.  


→ చిన్న పట్టణాలను తీసుకుంటే.. తమిళనాడులోని ఈరోడ్‌ ఎగుమతిదారులు 2025 జనవరి నుంచి 2026 మూడో త్రైమాసికం వరకు 121.5 మిలియన్‌ డాలర్ల అమ్మకాలు సాధించారు.  
→ అత్యధికంగా అమ్ముడవుతున్న కేటగిరీల్లో ఆరోగ్య..వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు (45 శాతం), నిత్యావసరాలు (44 శాతం), సౌందర్య సాధనాలు (42 శాతం), ఆటబొమ్మలు (35 శాతం) ఉన్నాయి. ఇవి గత పదేళ్లుగా వార్షికంగా 10 శాతం మేర వృద్ధి చెందాయి. 
→ ఈ ప్రోగ్రాం ద్వారా భారతీయ విక్రేతలు .. అమెరికా, బ్రిటన్, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్‌ తదితర 18 పైగా దేశాల్లో ఉత్పత్తులను విక్రయించుకునేందుకు అవకాశం లభిస్తోంది.

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)