Breaking News

దేశంలోనే తొలి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ హైబ్రిడ్‌ కారు వచ్చేసింది..

Published on Wed, 11/25/2026 - 20:06

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ సరికొత్త ఇన్నోవా హైక్రాస్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ హైబ్రిడ్‌ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.19.99 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) నిర్ణయించింది. దేశంలోనే తొలి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ వాహనంగా దీనిని సంస్థ పరిచయం చేసింది. సాధారణ పెట్రోల్‌తో పాటు 20 శాతం నుంచి 85 శాతం వరకు ఇథనాల్‌ కలిసిన ఇంధనంతోనూ (E20–E85) ఈ కారు నడుస్తుంది.

ఈ కొత్త మోడల్‌లో 2.0 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ అందించారు. ఇంజిన్‌, ఎలక్ట్రిక్‌ మోటార్‌ సమన్వయంతో వాహనం పనిచేస్తుంది. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ టెక్నాలజీ కారణంగా అధిక ఇథనాల్‌ శాతం ఉన్న ఇంధనాన్ని కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. బెంగళూరులోని బిడది ప్లాంట్‌లో ఈ వాహనాన్ని తయారు చేయనున్నారు.

ధరల విషయానికి వస్తే.. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ హైబ్రిడ్‌ G వేరియంట్‌ రూ.19.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. GX, VX, ZX వేరియంట్ల ధరలు వరుసగా రూ.23.99 లక్షలు, రూ.28.79 లక్షలు, రూ.31.99 లక్షలుగా ఉన్నాయి. సాధారణ పెట్రోల్‌ GX వేరియంట్‌ ధర రూ.19.59 లక్షలు. ఇవన్నీ పరిచయ ధరలు (ఎక్స్‌షోరూమ్‌).

అప్‌డేటెడ్‌ మోడల్‌లో డిజైన్‌తో పాటు ఫీచర్లలోనూ మార్పులు చేశారు. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. టయోటా సేఫ్టీ సెన్స్‌ కింద అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ (ADAS) ఫీచర్లనూ అందించారు.

భారత్‌లో ఇథనాల్‌ ఆధారిత ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా టయోటా ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. అయితే, E85 ఇంధనం అన్ని పెట్రోల్‌ బంకుల్లో అందుబాటులో లేకపోవడం ఈ టెక్నాలజీ వినియోగానికి కీలక సవాలుగా మారవచ్చు.

ఇదీ చదవండి: ఈవీల కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త స్కీమ్‌

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)