సాయి బోధామృతం

Published on Mon, 11/23/2026 - 00:48

నమ్మిన వారు, నమ్ముకున్న వారూ సాక్షాత్తూ దైవస్వరూపంగా... భగవాన్‌ అని, స్వామి అనీ పిలుచుకునే ఆయన సత్యసాయిబాబా. నవంబర్‌ 23, 1926న పుట్టపర్తిలో జన్మించిన సత్యసాయి బాబా 101వ జన్మదిన వేడుకలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయం పరిసర ప్రాంతాల్లో భజనలు, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేడు డోలోత్సవం, రథోత్సవం వంటి ప్రధాన కార్యక్రమాలు, రేపు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా ఆయన అందించిన అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక, నైతిక బోధనలు తెలుసుకుందాం...

1. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస (పంచ సూత్రాలు) 
మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఐదు విలువలను సత్యసాయి బాబా ఎల్లప్పుడూ బోధించారు: ఎల్లప్పుడూ నిజం మాట్లాడటం, మనసా వాచా కర్మణా ఒకేలా ఉండటం. నీతివంతమైన జీవితం గడపడం, ఇతరులకు హాని చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, కోరికలను అదుపులో పెట్టుకోవడం. ప్రతి జీవిలోనూ భగవంతుడిని చూస్తూ నిస్వార్థంగా ప్రేమించడం. ఆలోచన, మాట లేదా చేతల ద్వారా ఏ జీవికీ హాని తలపెట్టక΄ోవడం.

2. అత్యంత ప్రసిద్ధ సూక్తులు
‘అందరినీ ప్రేమించు – అందరికీ సేవ చేయి’: కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమించాలని, నిస్వార్థంగా సేవ చేయాలని ఆయన చెప్పారు.  ‘ఎల్లప్పుడూ సహాయం చేయి – ఎన్నడూ హాని చేయకు’ ఇతరులకు వీలైనంత సహాయం చేయడమే నిజమైన మానవత్వమని ఆయన బోధించారు.
‘మానవ సేవే మాధవ సేవ’: సాటి మనిషికి చేసే సేవ నేరుగా భగవంతుడికి చేసే పూజతో సమానమని ఆయన స్పష్టం చేశారు.
‘విద్యకు పరమార్థం వినయం (శీలం)’: కేవలం డిగ్రీలు సంపాదించడం మాత్రమే విద్య కాదని, మంచి నడవడిక, వినయం, సేవాభావం పెంపొందించుకోవడమే అసలైన విద్య అని ఆయన తెలిపారు.

3. సర్వమత సమ్మేళనం
 ‘ఉన్నది ఒక్కటే కులం – అది మానవ కులం’: ఉన్నది ఒక్కటే మతం – అది ప్రేమ మతం; ఉన్నది ఒక్కటే భాష – అది హృదయ భాష; ఉన్నది ఒక్కటే దేవుడు – ఆయన సర్వాంతర్యామి‘ అని ఆయన ప్రబోధించారు. అన్ని మతాలు చెప్పే సారాంశం ఒక్కటేనని, ఏ మతాన్ని ఆచరించినా తోటివారిని ప్రేమించడమే ముఖ్యమని ఆయన బోధించారు.

– జంపని నాగేశ్వరరావు

Videos

బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..

షర్మిల గారు మిమ్మల్నే అడుగుతున్న.. వీటికి సమాధానం చెప్పండి చాలు..

పాక్ చేతిలో భారత్ కు ఘోర ఓటమి...

పెళ్ళికొడుకు తరుపు వాళ్ళు ఎంత బాధ పడుతున్నారంటే.. రాంనాథ్ షాకింగ్ నిజాలు

కేవలం 1 లక్షతో 10 లక్షలు సంపాదించే ప్లాన్.!

రణబీర్, యష్ కాదు..! పార్ట్ 2లో ఆయనే హైలెట్...

కండువా కప్పుకోలేదంతే..! బాబు చిటికెయ్యగానే.. పెళ్లి ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోయింది..

పేర్ని కిట్టు ఆధ్వర్యంలో YSRCP చేరిన TDP సీనియర్ నేత

చెల్లి అడిగిందని సొంత ఆస్తి ఇచ్చాడు.. తనది కాని ఆస్తి ఎలా ఇస్తాడు?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దిగి రానున్న బంగారం..!

Photos

+5

‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్... రెడ్‌ శారీలో మెరిసిన హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫోటోలు)

+5

కార్తీక సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు (ఫోటోలు)

+5

విశాఖపట్నం : కార్తీక సండే.. సందడి (ఫోటోలు)

+5

అనిరుధ్- కావ్య రిసెప్షన్‌లో సినీ, క్రీడా ప్రముఖుల సందడి.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : కోటి దీపోత్సవంలో వైభవంగా మధుర మీనాక్షి కల్యాణం (ఫోటోలు)

+5

శర్వానంద్‌ ‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

మిర్నా తాజా ఫొటోలు..

+5

ప్రభాస్‌ బ్యూటీ.. చీరలో మెరిసి (ఫోటోలు)

+5

డేంజర్ బాయ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు)

+5

హై మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)