Breaking News

కిషన్ రెడ్డి పాదయాత్రకు హీరో నాగార్జున మద్దతు

Published on Thu, 11/19/2026 - 16:30

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 25, 26, 27 తేదీల్లో 'నషా ముక్త్ భారత్ యాత్ర' పాదయాత్ర జరగనుంది. యువత భవిష్యత్తుని నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై పోరాటానికి సినీ, రాజకీయ రంగాలు ఏకమవుతున్నాయి. డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం కోసం చేపడుతున్న ఈ ర్యాలీకి ఇప్పటికే చిరంజీవి తన సపోర్ట్ అందించగా ఇప్పుడు అక్కినేని నాగార్జున సంపూర్ణ మద్దతు తెలిపారు.

(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా 'కల్ట్')

హైదరాబాద్‌లో జరిగే వాక్‌లో పాల్గొనాలని నాగార్జునను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డితో కలిసి నషా ముక్త్ భారత్ యాత్ర టీ-షర్టులని  నాగార్జున ఆవిష్కరించారు. డ్రగ్స్ మత్తులో యువత జీవితాలు నాశనం కావడం ఆందోళనకరమని చెప్పిన నాగ్.. డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు. ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తన మద్దతు ఉంటుందని చెప్పారు.

ప్రధాని మోదీ ఇచ్చిన 'నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్' పిలుపుతో ఈ యాత్ర జరగనుండగా.. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా యువత, తల్లిదండ్రులు, ప్రజలంతా యాత్రలో భాగస్వాములు కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

(ఇదీ చదవండి: కూతురి గురించి తప్పుడు రూమర్స్.. హీరో అర్జున్ సర్జా ఆగ్రహం)

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)