Breaking News

కోటికి పైగా అప్పుల నుంచి గూగుల్‌ ఉద్యోగం, స్టార్టప్‌ విజయం వరకు..!

Published on Wed, 11/18/2026 - 17:03

తల్లిదండ్రులు అప్పుల్లో కూరుకుపోతే..చాలామంది అన్ని అప్పులు ఎందుకు చేశారనే నిలదీస్తారు చాలామంది పిల్లలు. కోటీలో ఒక్కడే వారిని ఆ కష్టం నుంచి బయటపడేసేందుకు పూనుకుంటాడు. అలాంటి కొడుకే ఈ వ్యక్తి. అతడిని చూస్తే..బిడ్డ అంటే వాడురా అని గర్వంగా చెప్పుకునేలాంటి వ్యక్తితత్వం అతడిది. అంతేగాదు ఎడతెగని కష్టాలకు తన విజయవంతమైన కెరీర్‌తో చెక్‌పెట్టిన విధం యువతకు స్ఫూర్తి.

28-year-old Yash Garg Success Story: అతడే 28 ఏళ్ల యశ్‌గార్గ్‌. రెడ్డిట్‌లో తన స్టోరీని షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. అతడు పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చాడు. తాను ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్‌నని తెలిపాడు. అతడు ఐఐటీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడే తన కుటుంబం తీవ్ర అప్పుల ఊబిలో చిక్కుకుందని తెలుసుకున్నాడట. తన తండ్రి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడని, ఒక బిల్డర్ల నుంచి నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌లపై పెట్టుబడులు పెట్టారు. అయితే అతడు ఫ్లాట్లను ఏళ్ల తరబడి అప్పగించకపోవడంతో..బ్యాంకు ఈఎంఐలు చెల్లించమని ఒత్తిడి పెరిగింది. 

దాంతో స్నేహితులు, బంధువుల నుంచి అడిగినకాడికి అప్పులు చేయడం ప్రారంభించారు. చివరికి ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడానికి కూడా క్రెడిట్‌ కార్డుపై ఆధారపడే స్థితికి వచ్చేశారు. చిన్నప్పుడు తన కుటుంబానికి అప్పులు ఉన్నాయని తెలుసు గానీ ఈ రేంజ్‌లో ఉన్నాయన్న విషయం తెలియదన్నాడు. తమది స్వతహాగా ఢిల్లీ కావడంతో వీకెండ్‌కి ఇంటికి వచ్చినప్పుడు అప్పలు వాళ్లు రావడం చూశాక అర్థమైంది ఇంటి పరిస్థితి. దాంతో అసలు మనకు ఎన్ని అప్పులు ఉన్నాయో తన పేరెంట్స్‌ని పిలిచి ఒక పేపర్లో రాయమనగా..మొత్తం ఏకంగా కోటి రూపాయలని తేలింది. 

ఇది తన అమ్మను ఎంతగా ప్రభావితం చేసిందో చాలా దగ్గరగా చూశానని అన్నాడు. నిజానికి తాను స్టార్టప్‌ నిర్మించాలనే ఆశయంతో ఐఐటీ ఢిల్లీలో చేరాడు కానీ..ముందు తల్లిదండ్రులను అప్పుల కష్టాల నుంచి బయటపడేయడమే ముఖ్యమని గ్రహించి తన లక్ష్యాన్ని వాయిదా వేసుకున్నాడు. అలా అతడు 2019లో తన గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయిన వెంటనే  బెంగళూరు కోహెసిటీ కంపెనీలో చేరి ఏడాదికి రూ. 18 లక్షలు జీతం ఆఫర్‌ని అందుకున్నాడు. 

అది మంచి ఉద్యోగామే కానీ తమ అప్పులు తీర్చడానికి ఎంత మాత్రం సరిపోదని చెప్పుకొచ్చాడు. అలా అతడు బెంగళూరు వెళ్లి తన ఖర్చులు తగ్గించుకుని మిగతాదంతా ఇంటికి పంపించేసేవాడు. ఆ తర్వాత అతను ట్రావెల్ టెక్నాలజీ స్టార్టప్ అయిన స్పాట్‌నానాలో వ్యవస్థాపక ఇంజనీర్‌గా చేరాడు. అయినా అప్పుల గుదిబండ ఎంత మాత్రం తగ్గనట్లుగా అనిపించింది. ప్రతి రూపాయి ఇంటికే పంపిస్తున్నా..ఎందుకిలా అని చెక్‌చేయగా క్రెడిట్‌ కార్డు బిల్లుల వడ్డీకే తను పంపించే డబ్బు సరిపోతుందని తెలుసుకుని..అధిక మొత్తం వేతనం అందించే గుగూల్‌ జాబ్‌పై ఫోకస్‌ పెట్టినట్లు వివరించాడు. 

తన కాలేజ్‌ సీనియర్‌ ఇచ్చిన రిఫరెన్స్‌ సాయంతో సెర్చ్‌ టీమ్‌లో స్థానం దక్కించుకున్నాడు. అలా స్టాక్‌తో సహా సుమారు రూ. 75 లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో అతను డిసెంబర్ 2021లో గూగుల్‌లో చేరినట్లు తెలిపాడు. గూగుల్‌ అనుమతితో రాత్రులు, వారాంతాల్లో పనిచేస్తూ..మరోవైపు తన తండ్రితో కలిసి మొబైల్‌ యాప్‌లను రూపొందించడం ప్రారంభించాడు. అలా రూ. 2.1లక్షలకు ఒక మ్యాక్‌బుక్‌ ప్రో కొనుగోలు చేసి అత్యధికంగా డౌన్‌లోడ్‌ అయ్యే ఆండ్రాయిడ్‌ గేమ్‌ను ఎంచుకుని ఆరురోజుల్లో దాని ఐఓఎస్‌ వెర్షన్‌ను రూపొందించాడు. 

అలా కొద్ది రోజుల్లోనే ఆ గేమ్‌ సంపాదన ల్యాప్‌టాప్‌ ఖర్చును భర్తీ చేయడమే గాక మరిన్ని గేమ్‌లు జోడించి రూ. 6 లక్షల నుంచి రూ. 24 లక్షల వరకు ఆర్జించాడు. తర్వాత ఏడాదిన్నరలో వాళ్ల యాప్‌ల వ్యాపారం రూ. 2 కోట్లుకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. అలా తాను గూగుల్‌, యాప్‌ల మధ్య వారానికి వంద గంటలు పైనే పనిచేశానన్నారు. అలా 2023 జూన్‌ కల్ల తన కుటుంబ చివరి రుణాన్ని తీర్చేసి తక్షణమే గూగుల్‌ జాబ్‌కి రిజైన్‌ చేసేసినట్లు చెప్పుకొచ్చాడు. 

అప్పులననీ తీర్చేశాక..ఎలాంటి టెన్షన్‌ లేకుండా హాయిగా నిద్రలేచే రోజు వచ్చిందన్న సంతోషమే ఎక్కువ కలిగిందన్నాడు. ఆ తర్వాత ఆయన గేమ్‌ వ్యాపారాన్ని మూసివేసి, సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ (SaaS) వైపు మళ్లారు. అలా షాపిఫై యాప్‌లను కొద్దికాలం పరిశీలించిన తర్వాత సూపర్‌ వర్క్‌డే స్థాపించి..ఆ ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే బృందాల కోసం అప్లికేషన్లను రూపొందిస్తుంది. అయితే మొదట్లో కస్టమర్లు ఒక్కరు కూడా రాలేదు..సుమారు ఎనిమిది నెలల నిరీక్షణ తర్వాత తన తొలి కస్టమర్‌ రావడంతో కలిగన ఆనందం ఎప్పటికీ మర్చిపోననన్నాడు గార్గ్‌. 

ఇవాళ ఆ ఫ్లాట్‌ఫాంకి 300కు పైగా కస్టమర్లు ఉన్నారు. ఈ స్టార్టప్‌తో ఏడాదికి దాదాపు రూ. 93 లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలిపారు. దీంతో తన సోదరి వివాహానికి నిధులు చేకూర్చగలిగానని గార్గ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో మరో స్టార్టప్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అతడు స్టోరీ వింటే..జీరో నుంచి కూడా కాదు. ఆల్‌మోస్ట్‌ మైనస్‌ నుంచి ప్రారంభించి..అంచలంచెలుగా ఎదిగినా..అదంతా రుణాలు తీర్చడంతోనే సరిపోయినా..ఎక్కడ రాజీపడలేదు. పైగా ఆ కోట్ల అప్పలు తీర్చి..చెల్లిపెళ్లి చేసి తన డ్రీమ్‌ని కూడా సాకారం చేసుకున్నాడు. పట్టు వదలిన వాడిదే..గెలుపు అన్నమాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు.

ఇదీ చదవండి: శాస్త్రవేత్తగా కంటే..కంటెంట్‌ క్రియేషన్‌తోనే నెలకు రూ. 20 లక్షలు పైనే..!

 

#

Tags : 1

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)