వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు
Breaking News
సడన్‌గా ఓటీటీకి హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Published on Wed, 11/18/2026 - 11:50
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. ఈ వారంలో పలు చిత్రాలు ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఈ వీక్‌లో క్రేజీ కల్యాణం, అనుమాన పక్షి లాంటి మూవీస్ సందడి చేయనున్నాయి. అంతేకాకుండా పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు కూడా ఓటీటీ ఆడియ్సన్స్ ముందుకు రానున్నాయి. తాజాగా మరో మూవీ సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. ఇంతకీ ఏ సినిమా? ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.
(ఇది చదవండి: సడన్‌గా ఓటీటీకి సూపర్ హిట్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చన కన్నడ యాక్షన్ సినిమా మార్నామి. రిత్విక్, చైత్ర జంటగా వచ్చిన సినిమా కన్నడ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు రిషిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తాజాగా ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన పదివారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ మూవీని గుణాద్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిల్పా నిశాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
📢 STREAMING ALERT #Maarnami (Kannada) Now streaming on PrimeVideo 🍿!! #OTT_Trackers https://t.co/9XtSaE6VnJ
— OTT Trackers (@OTT_Trackers) November 18, 2026
Tags : 1