మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!
Breaking News
అల్లు అర్జున్ అక్క ఈమెనే.. పరిచయం చేసిన అల్లు అరవింద్
Published on Tue, 11/17/2026 - 11:36
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన తాజా చిత్రం ఆకాశంలో ఒక తార. ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. ఈ మూవీలో శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ నవంబర్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపైకి వచ్చిన అల్లు అరవింద్.. ఈవెంట్‌కు వచ్చినందుకు అల్లు అర్జున్‌కు థ్యాంక్స్ అంటూ సరదాగా మాట్లాడారు. ఆ తర్వాత అల్లు అరవింద్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ వేదికపై అల్లు అర్జున్ సిస్టర్‌ను అభిమానులకు పరిచయం చేశారు. అక్కడే ఉన్న విద్యను ఈమెనే అల్లు అర్జున్ అక్క అని అందరికీ షాకిచ్చారు. అయితే ఆమె ఎవరనే విషయంపై అందరిలోనూ సస్పెన్స్ నెలకొంది.
Tags : 1