Breaking News

ప్రియురాలితో నటుడు గోవిందా.. మరోసారి హాట్‌టాపిక్..!

Published on Fri, 11/13/2026 - 16:00

బాలీవుడ్ నటుడు గోవిందా పేరు గత కొన్ని నెలలుగా ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన భార్య సునీతాతో విభేదాలు రావడంతో చాలాసార్లు వార్తల్లో నిలిచారు. గోవిందా మరో అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని కనిపించడంతో విడాకుల రూమర్స్ కూడా వినిపించాయి. కానీ ఆమె కేవలం తన సినిమాలో నటిస్తోందని.. మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదని చాలాసార్లు కొట్టిపారేశారు. వీరిద్దరు జంటగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఇటీవల సెప్టెంబర్‌లో ముంబైలోని లాల్‌బాగ్‌చా రాజా పండాల్ వద్ద ఆశీర్వాదం తీసుకుంటూ జంటగా కనిపించారు.

తాజాగా గోవిందా మరోసారి వార్తల్లో నిలిచారు. తన ప్రియురాలిగా భావిస్తోన్న రాణి స్వర్ణకర్.. గోవిందాతో అత్యంత సన్నిహితంగా ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్‌లో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, చేతులు పట్టుకుని ఫుల్ రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలకు బ్యూటీఫుల్ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ కావడంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్‌లో మరోసారి చర్చ మొదలైంది. వీరిద్దరు ప్రస్తుతం రూపా అనే మూవీలో నటిస్తున్నారు.

సునీతా కామెంట్స్

గోవింద, రాణి స్వర్ణకర్‌ రిలేషన్‌పై  సునీత చాలాసార్లు స్పందించారు. వీరిద్దరిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా గోవిందను ‘షుగర్ డాడీ’ అని సంబోధించారు. కానీ అదే సమయంలో, గోవిందతో తన సంబంధం మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు సునీత తెలిపారు. ప్రస్తుత ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ నాలుగు దశాబ్దాల వివాహ బంధం నిలబడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ జీవితంలో మమ్మల్ని ఎవరూ విడదీయలేరని ఆమె అన్నారు. ఈ విషయాన్ని తాను దేవుడికే వదిలేశానని సునీత తెలిపారు. కాగా.. గోవింద, సునీతలకు 1987 నుంచి వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

 

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు