Breaking News

విరిగిన పక్కటెముకులు.. 'సలార్' నటుడికి ఏమైంది?

Published on Fri, 11/13/2026 - 12:11

రీసెంట్ టైంలో తెలుగులో వచ్చిన సలార్, లక్కీ భాస్కర్, పెద్ది సినిమాల్లో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు-దర్శకుడు టిన్ను ఆనంద్.. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొన్నిరోజుల క్రితం ఈయనకు తీవ్ర గాయాలు కాగా ఐదు పక్కటెముకులు విరిగిపోయినట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి, ఊపిరితిత్తులకు గుచ్చుకోవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో తాజాగా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: అమ్మ వచ్చింది.. హౌస్ ఎమోషనల్ అయింది)

ప్రస్తుతం టిన్ను ఆనంద్ ఇంట్లోనే ఉండి కోలుకుంటున్నారు. వైద్యులు ఆయనకు కఠినమైన బెడ్ రెస్ట్ సూచించారు. ఇంటి వద్దే ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నారు. కూర్చున్నా, పడుకున్నా, శరీరాన్ని ఒక వైపు నుంచి మరోవైపుకు తిప్పుకున్నా ఇంకా నొప్పి వేధిస్తోందట. మంచం పైనుంచి లేవడానికి, కూర్చోవడానికి, పక్కకు తిరగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మాట్లాడేటప్పుడు కూడా అసౌకర్యంగా ఉంటోందని తెలుస్తోంది. అయితే టిన్నుకు ఈ గాయాలు ఎలా అయ్యాయనేది ఇంకా క్లారిటీ రాలేదు.

మరోవైపు పెండింగ్‌లో ఉన్న డబ్బింగ్ పనులు పూర్తి చేయాలని కొందరు నిర్మాతలు ఆయనను సంప్రదించారట. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఇలా ఉండటంతో చేస్తున్న సినిమాల పరిస్థితి ఏంటనేది తెలియట్లేదు. టిన్ను ఆనంద్ అసలు పేరు వీరేంద్ర రాజ్ ఆనంద్. ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రేతో ఐదేళ్లు పనిచేసిన తర్వాత దర్శకుడిగా మారారు. అమితాబ్ బచ్చన్‌తో కలిసి చేసిన 'కాలియా', 'షహెన్‌షా', 'మై ఆజాద్ హూన్', 'మేజర్ సాబ్' మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. రీసెంట్ టైంలోనే కాదు గతంలో తెలుగులో ఆదిత్య 369, ఘటోత్కచుడు, అంజి తదితర మూవీస్ చేశారు. గత కొన్నేళ్లలో అయితే సాహో, సీతారామం, సలార్, లక్కీ భాస్కర్, పెద్ది చిత్రాల్లో కనిపించారు.

(ఇదీ చదవండి: మౌళి 'డీఎన్‌కే' (దొంగ నా కొడుకు) రివ్యూ)

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు