Breaking News

అనిరుధ్, కావ్య మారన్‌లది ఆత్మగౌరవ వివాహం..! ఎలా చేస్తారంటే..

Published on Fri, 11/13/2026 - 10:54

సంగీత స్వరకర్త అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స​ హైదరాబాద్‌ సహ యజమాని కావ్యమారన్‌లు నవంబర్‌ 11న గ్రీస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగత తెలిసిందే. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెక చక్కర్లు కొడుతున్నాయి. అందులోని పెళ్లి ఆచారాలు చూసి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే..సంప్రదాయ వివాహ వేడుక మాదిరిగా జరగలేదు. కావ్యమెడలో గొలుసు వేస్తున్న ఫోటో వైరల్‌ అవ్వడంతో ఇదేం వివాహ తంతు అంటూ ఆ ఆచారాలపై రకరకాల ఊహగానాలు మొదలయ్యాయి. ఇంతకీ ఏంటా వివాహ ఆచారం అంటే..!.

Anirudh and Kavya got married: ఆ అనుమానాలకు తెరదించుతూ..ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఐటీ వింగ్ కార్యదర్శి డాక్టర్ టి.ఆర్.బి. రాజా,ఆ వివాహ వేడుకలో ఏం జరిగిందో సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. అనిరుధ్‌, కావ్యలు ఆత్మగౌరవ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. వాళ్లు గొలుసులు మార్చుకుని తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారని తెలిపారు. అలాగే వారి దాంపత్యం కలకాలం పదిలంగా ఉండాలంటూ బంధుమిత్రులు మనసారా దీవించారు. ఇక ఏంటి ఈ ఆత్మగౌరవ వివాహం అంటే..

ఎలా జరుగుతుందంటే..
ఆత్మగౌరవ వివాహం అనేది తమిళనాడు సంఘ సంస్కర్త పెరియార్ ఇ.వి. రామస్వామి ప్రారంభించిన ఆత్మగౌరవ ఉద్యమం నుంచి ఉద్భవించిన ఒక వివాహ తంతు ఇది. ఇది సాధారణ సాంప్రదాయ వివాహ ఆచారాలను, కుల వివక్షను, మత పెద్దల పాత్రను సవాలు చేసేలా జరుగుతుంది. ఈ ఆత్మగౌరవ వివాహంలో వధువరులు సాక్షుల సమక్షంలో ఒకరికొకరు తమ నిబద్ధతను ప్రకటించుకుంటూ..పూలమాలలు లేదా ఉంగరాలను మార్చుకుంటారట. 

ఈ వేడుకకు మత గురువు గానీ, విస్తృతమైన మతపరమైన ఆచారాలు గానీ ఉండవు. 1967లో తమిళనాడులో హిందూ వివాహ చట్టానికి చేసిన సవరణ ద్వారా, సాంప్రదాయ మతపరమైన వేడుకలు లేకుండా ఆత్మగౌరవ వివాహాలను చట్టబద్ధంగా జరిపించడానికి అనుమతి లభించింది. అప్పటి నుంచి ఈ వివాహ తంతు చట్టపరమైన గుర్తింపు పొందింది.  ఈ పెళ్లిలో పురోహితుడు, మంగళసూత్రం, సప్తపది (ఏడు అడుగులు) వంటి సంప్రదాయ తంతులు తప్పనిసరి కాదు. 

బంధువులు లేదా స్నేహితుల సమక్షంలో వధూవరులు పూలమాలలు లేదా ఉంగరాలు మార్చుకుని, సమానత్వంతో కూడిన ప్రమాణాలు చేస్తూ ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా ప్రకటించుకుంటారు. అదీగాక 2023 ఆగస్టులో సుప్రీంకోర్టు ఆత్మగౌరవ వివాహాలు పూర్తిగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది కూడా.

 

ఇదీ చదవండి: Miss Universe 2026: పింక్‌ లిల్లీలా అందంగా పాక్‌ బ్యూటీ మిస్బా అర్షద్‌..!

 

 

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు