Breaking News

ఎన్విడియా సీఈఓ వారసుల జీతం ఎంతంటే..

Published on Thu, 11/12/2026 - 09:16

ప్రపంచ ఏఐ రంగంలో దూసుకుపోతున్న ‘ఎన్విడియా’ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) జెన్సన్ హువాంగ్ కుటుంబానికి సంబంధించి తాజాగా వెలువడిన అధికారిక నివేదికలు కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. హువాంగ్ కుమారుడు స్పెన్సర్ హువాంగ్, కుమార్తె మాడిసన్ హువాంగ్ ఇద్దరూ వార్షిక వేతనాల రూపంలో ఒక్కొక్కరు మిలియన్ డాలర్లకు పైగా ఆర్జిస్తున్నట్లు కంపెనీ తాజాగా విడుదల చేసిన ప్రాక్సీ స్టేట్‌మెంట్‌లో వెల్లడించింది.

కంపెనీ ఆర్థిక నివేదికల ప్రకారం.. జెన్సన్ హువాంగ్ కుమార్తె మాడిసన్ హువాంగ్ టోటల్ కాంపెన్సేషన్ కింద దాదాపు 1.23 మిలియన్ డాలర్లు(సుమారు రూ.10 కోట్లు) అందుకోగా, కుమారుడు స్పెన్సర్ హువాంగ్ దాదాపు 1.32 మిలియన్ డాలర్ల మొత్తాన్ని ఆర్జించారు. ఈ ప్యాకేజీల్లో కేవలం బేస్ జీతమే కాకుండా ఈక్విటీ అవార్డులు తదితర ప్రోత్సాహకాలు కూడా కలిసి ఉన్నాయని ఎన్విడియా స్పష్టం చేసింది. అయితే, ఈ నియామకాలు, వేతనాల నిర్ణయ ప్రక్రియలో జెన్సన్ ఎలాంటి జోక్యం చేసుకోలేదని, ఇతర ఉద్యోగులకు వర్తించే సాధారణ కంపెనీ విధానాల ప్రకారమే వీరికి బాధ్యతలు, వేతనాలు కేటాయించారని ఎన్విడియా స్పష్టం చేయడం గమనార్హం.

టెక్ మార్గానికి భిన్నంగా..

జెన్సన్ హువాంగ్ వారసులు అయినప్పటికీ మాడిసన్, స్పెన్సర్‌ల కెరీర్ ప్రారంభం సాంప్రదాయ టెక్ రంగం వైపు సాగలేదు. మాడిసన్ హువాంగ్ మొదటగా కలినరీ ఆర్ట్స్‌ వైపు ఆసక్తి చూపి, పారిస్‌లో శిక్షణ పొంది ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ ఎల్‌వీఎంహెచ్ వంటి సంస్థల్లో పనిచేశారు. ఆ తర్వాత లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసి 2020లో ఎన్విడియాలో ఇంటర్న్‌గా చేరి క్రమంగా ఉన్నత స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆమె ఎన్విడియాలో ఫిజికల్ ఏఐ, ఓమ్నివర్స్ సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు కుమారుడు స్పెన్సర్ హువాంగ్ తైవాన్‌లోని తైపీలో కొన్నాళ్లపాటు ఒక కాక్‌టెయిల్ బార్‌కు సహ-స్థాపకుడిగా ఉన్నారు. ఆ తర్వాత న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేసి 2022లో ఎన్విడియాలో చేరారు. ప్రస్తుతం ఆయన కంపెనీ రోబోటిక్స్ అండ్ సిమ్యులేషన్ బిజినెస్ విభాగంలో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్‌ను లీడ్ చేస్తున్నారు. రోబోట్లు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అర్థం చేసుకునేలా వర్చువల్ సిమ్యులేషన్ల ద్వారా శిక్షణనిచ్చే సాంకేతికతల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

తండ్రి ఆ స్థానంలో ఉన్నా..

కంపెనీలో అత్యున్నత స్థాయిలో జెన్సన్ హువాంగ్ సీఈఓగా ఉన్నప్పటికీ ఆయన పిల్లలు ఇద్దరూ ఎలాంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో లేరని, పైగా నేరుగా తమ తండ్రికి రిపోర్ట్ చేసే విధంగా వారి విధులు లేవని ఎన్విడియా స్పష్టం చేసింది. టెక్ ప్రపంచంలో ఎన్విడియా సాధిస్తున్న అసాధారణ వృద్ధి నేపథ్యంలో భవిష్యత్ వ్యూహాత్మక రంగాలైన రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ, ఓమ్నివర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో వీరు ఇద్దరూ బాధ్యతలు నిర్వర్తించడం కార్పొరేట్ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: పంచ్‌ ఫలక్‌నామాకే పంచ్‌! కార్పొరేట్ కఠిన నిజాలు

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)