Breaking News

తప్పులు చేసినవారినీ ఉన్నతులుగా తీర్చిదిద్దే సద్గురువులు!

Published on Thu, 11/12/2026 - 07:40

కొందరు సద్గురువులు ఈ జన్మలో ఎవరెవరు ఏమి చేయబోతున్నారో తెలుసు కోగలరు. చెడ్డపనులు చేసేవారిని ఈ జన్మలోనే చేరదీసి, చక్కదిద్ది, వారిచేత అద్భుతమైన పనులు చేయిస్తారు. తరువాతి జన్మలోనైనా సమాజానికి ఉపయోగ పడే వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు.

అవంతీపురంలో భద్రాయువు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వివాహ మయిన తర్వాత భార్యనెందుకో వదిలి పెట్టాడు. ఒక వేశ్యతో సంబంధం పెట్టు కొన్నాడు. దీంతో నిష్ఠ, నియమం, సత్కర్మాచరణం అన్నీ వదిలేశాడని ఆయన్ని వెలివేశారు. ఒకరోజున ఋషభుడనే మహాయోగి ఈ వేశ్య ఇంటికే వెళ్ళాడు. భ్రష్టుడు అనుకొంటున్న ఆ బ్రాహ్మణుని చేతి మీదుగా పాదపూజ చేయించుకొన్నాడు.

కొంతకాలం తర్వాత ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు. తిరిగి  వజ్రబాహుడనే చక్రవర్తికి జన్మించాడు. భద్రాయువు పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితంగా పసితనంలోనే పురుగులు పట్టి అతని శరీరం కుళ్ళిపోయింది. దాంతో తల్లీ బిడ్డలిద్దరినీ అడవిలో వదిలేశారు. అదే సమయంలో ఋషభుడు అక్కడికి రావటం తటస్థించింది. పూర్వజన్మలో భద్రాయువు ఉదంతం తెలిసినవాడైనందున అతడికి తెలివిని, తేజస్సును, ఆరోగ్యాన్ని, ఒక కత్తిని, శివకవచాన్ని అనుగ్రహించాడు.

భద్రాయువు ఉన్న మగధ దేశాన్ని శత్రురాజు ఆక్రమించాడు. ఋషభుని ఆదేశానుసారం భద్రా యువు రాజుకు సహాయకుడుగా వెళ్ళి శత్రురాజును యుద్ధంలో ఓడించి ఆ రాజ్యాన్ని యథాప్రకారం రాజు కప్పగించాడు. భద్రాయువు అతడి కుమారుడేనని ఋషభుడు చెప్పడంతో సంతసించి తన సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. ఇలా సద్గురువైన ఋషభయోగి... మూర్ఖుడు, భ్రష్టుడు, పాపి అయిన వాడి వెంటబడి తన కృపతో దేవేంద్ర వైభవాన్ని అతని కనుగ్రహించాడు.

- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి

ఇదీ చదవండి: నేటి అసురులపైనా నాటాలి శరం

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)