Breaking News

పెళ్లి మండపంలో ఫౌజీ

Published on Wed, 11/11/2026 - 01:02

ఇటలీ నుంచి నేరుగా హైదరాబాద్‌లోని పెళ్లి మండపంలోకి ప్రభాస్‌ అడుగుపెట్టారని తెలిసింది. కానీ ప్రస్తుతానికి ఇది రియల్‌ లైఫ్‌లో కాదు... రీల్‌ లైఫ్‌లో అన్నమాట. ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘ఫౌజీ’. ఇమాన్వి ఇస్మాయిల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జయప్రద, మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ సీక్రెట్‌ సోల్జర్‌గా కనిపిస్తారని తెలిసింది. 

ఇక ఇటీవల వెకేషన్‌ కోసం ఫారిన్‌ వెళ్లిన ప్రభాస్‌ ఇండియాకు వచ్చీ రాగానే ‘ఫౌజీ’ చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. పెళ్లి మండపం సెట్‌లో జరుగుతున్న ఈ సినిమా షూట్‌లో   ప్రభాస్‌తో పాటు ఇమాన్వీ పాల్గొంటున్నారు.

ఈ కీలక సన్నివేశాల తర్వాత ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్లాన్‌ చేశారట హను రాఘవపూడి. టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది. మరోవైపు ‘స్పిరిట్, కల్కి 2’ సినిమాల చిత్రీకరణలతో కూడా ప్రభాస్‌ బిజీగా ఉంటున్నారు. ఇక ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలోని ‘సలార్‌ 2’ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.  

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)