‘అణు కేంద్రాలపై బాంబులేస్తే ఇవి మింగండి’

Published on Sat, 11/07/2026 - 15:26

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వస్తున్న తీవ్ర హెచ్చరికలు, దాడుల బెదిరింపుల నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలున్నాయన్న అనుమానాలతో టెహ్రాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా దేశంలోని సున్నితమైన అణు కేంద్రాలు, ముఖ్యంగా పిక్కెక్స్ మౌంటెన్ (Pickaxe Mountain) వంటి కీలక ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజలకు అధికారులు యాంటీ రేడియేషన్ (అయోడిన్) మాత్రలను పంపిణీ చేయడం ప్రారంభించారు.

ట్రంప్ హెచ్చరికల నేపథ్యం

ఇరాన్ అణు కార్యక్రమం, ఇతర వివాదాస్పద అంశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇరాన్‌ దేశంలో మిగిలిన ప్రాంతాలను నాశనం చేయాలని నేను కోరుకోవడం లేదు. అయితే బహుశా ఆ పరిస్థితి వస్తే చేయాల్సి రావచ్చు. మీకే త్వరలో తెలుస్తుంది’ అంటూ ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా, తాము ఏ క్షణంలోనైనా దాడులకు సిద్ధంగా ఉన్నామని అమెరికా సైనిక బలగాలు సంకేతాలు ఇవ్వడంతో ఇరాన్ రక్షణ వలయాన్ని మరింత కట్టుదిట్టం చేస్తోంది.

అయోడిన్ మాత్రల పంపిణీ ఎందుకు?

అణు ప్రమాదాలు లేదా క్షిపణి దాడుల వేళ రేడియేషన్ ప్రభావం నుంచి మానవ శరీరంలోని థైరాయిడ్ గ్రంథిని రక్షించుకోవడానికి పొటాషియం అయోడిన్‌ మాత్రలు దోహదపడతాయి. ప్రతికూల పరిస్థితుల్లో అటామిక్‌ ప్లాంట్ల చుట్టూ రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను రక్షించేందుకు ఈ ముందస్తు చర్యలు చేపట్టామని ఇరాన్ అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ట్రంప్ ప్రభుత్వంపై నమ్మకం లేదని, వారు ఏ క్షణంలోనైనా సైనిక చర్యలకు దిగే ప్రమాదముందని టెహ్రాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

పెరుగుతున్న ఉద్రిక్తత

అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు నిలిచిపోవడం, ఇరు దేశాల మధ్య పరస్పర హెచ్చరికలు తీవ్రమవుతుండటంతో ప్రాంతీయ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు అమెరికా సైన్యం (సెంట్‌కామ్‌) వ్యూహాత్మక ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా, మరోవైపు ఇరాన్ పౌరులను అణు ముప్పు నుంచి రక్షించేందుకు అత్యవసర ప్రణాళికలను అమలు చేస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను, ముఖ్యంగా గల్ఫ్ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇదీ చదవండి: మాదేశం వచ్చినవారికి గుడ్‌న్యూస్‌!

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)