Breaking News

హే..! ఇంత పెద్ద గడ్డమా?! ఏకంగా ప్రపంచ రికార్డు..

Published on Thu, 11/05/2026 - 12:47

అమెరికాకు చెందిన 54 వ్యక్తి గడ్డంతో ప్రపంచ రికార్డులకెక్కాడు. ఏకంగా 5 అడుగుల 3 అంగుళాల సహజ గడ్డం పెంచినందుకు వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. కాన్వాస్‌లోని బాల్డ్విన్‌కు చెందిన మాథ్యూ హే రెండు దశాబ్దాలకు పైగా తన గడ్డాన్ని కత్తిరించలేదన. జీవించి ఉండి, అత్యంత పొడవైన సహజ గడ్డం పెంచినందుకు ఈ టైటిల్‌ని కైవసం చేసుకున్నాడు. 

అతని గడ్డం తన తోటి అమెరికన్‌ అయిన రుడాల్ఫ్‌ మార్టినో పేరిట ఉన్న మూడు అడుగుల ఆరు అంగుళాల మునుపటి రికార్డు కంటే రెండు అడుగుల పొడవు ఉండటం విశేషం. ఈ మేరకు హే మాట్లాడుతూ..తాను సుమారు 20 ఏళ్ల క్రితం గడ్డం పెంచడం ప్రారంభించినట్లు తెలిపారు. అతను ఎప్పుడు చిన్న గడ్డాన్నే ఉంచుకున్నప్పటికీ..కొందరు చిన్నారులు దాన్ని అల్లమని అడగడంతో గడ్డం పెంచాలనే ఆలోచన వచ్చిందట. 

ఆ రూపం నచ్చడంతో తను గడ్డం షేవ్‌ చేసుకోవడమే మానిసినట్లు తెలిపాడు. కాలక్రమేణ ఆ అల్లిన జుట్టు ఒకే పాయగా చిక్కుపడి, ప్రతి ఏడాది సుమారు మూడు నుంచి నాలుగు అంగుళాలు పెరుగతూ వచ్చిందట. చివరి అది తన బెల్టు మాదిరిగా నడుముకు చుట్టుకునేంత పొడవుగా పెరిగిందని చెప్పుకొచ్చాడు. 

ఎలా మెయింటైన్‌ చేస్తాడంటే..
ఇంతపెద్ద గడ్డం పెంచడం ఒక ఎత్తు మెయింటైన్‌ చేయడం మరోక ఎత్తు కదా. మరి హే మాత్రం అంత పెద్ద గడ్డాన్ని ముడి వేసి తన రోజువారీ పనులు చేసుకుంటాడట. అంతేగాదు షాంపు, కండీషనర్‌లతో దాన్ని క్లీన్‌గా ఉంచుకుంటాడట. అంతేకాదండోయ్‌ రికార్డు స్థాయిలో పొడువుగా ఉన్న ఆ గడ్డానికి భీమా చేయించాలా లేదా అని ఆలోచిస్తున్నాడట. 

అలాగే కొందరు తన రూపాన్ని చూసి ప్రశంసించగా, మరికొందరు విమర్శిస్తుంటారట కూడా. ఇంకో విశేషమేమిటంలో నో షేవ్‌ నవంబర్‌ నెలలోనే అతడి రికార్డు నమోదవ్వడం. ప్రస్తుతానికి హే ఆ గడ్డాన్ని కత్తిరించాలని ఆలోచన లేదని, మరింతగా పెంచుతూ సంరక్షించాలనే అనుకుంటున్నాడట.లి

ఇదీ చదవండి: ఆటో నడుపుతూనే సూపర్‌ టెట్‌కి సన్నద్ధం..! మనసుని కదిలించే కథ..

 

#

Tags : 1

Videos

ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...

కూటమి అరాచకాలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్

నన్ను ఆపడానికి నువ్వు ఎవడివి? ఇచ్చిపడేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

చెరువుగా మారిన శంద్రబాబు రాజధాని!

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

దొంగ ఓటర్లను చితకబాదిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియోలు

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా..! అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

అంతా రామమయం..!

మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు

Photos

+5

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

+5

సింపుల్‌ లుక్స్‌లోనూ అదిపోయిన భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌

+5

నగలతో నిండైన అందం.. కంగనా ట్రెడిషనల్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

గోల్డెన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)

+5

38వ బర్త్‌డే.. విరాట్‌ కోహ్లి ఫొటోలు వైరల్‌

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)