రూ.600లకే 1000 కి.మీ ప్రయాణం

Published on Wed, 11/04/2026 - 18:13

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వినూత్న ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. రాత్రి వేళల్లో ఈవీ ఛార్జింగ్‌కు ప్రతి యూనిట్‌కు రూ.3, పగటి పూట రూ.5 చొప్పున విద్యుత్ ధర నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ముంబైలో జరిగిన ‘కేపీఎంజీ ఎన్‌రిచ్‌ 2026’ గ్లోబల్ సదస్సులో పాల్గొన్న ఆయన ఈ విధానం అమలులోకి వస్తే 1000 కిలోమీటర్ల ప్రయాణం కేవలం రూ.600 విద్యుత్ ఖర్చుతోనే పూర్తవుతుందని వివరించారు.

టైమ్-ఆఫ్-డే టారిఫ్‌తో మార్పులు

పగటిపూట సోలార్ విద్యుత్ లభ్యత ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రిడ్ డిమాండ్‌ను సమతుల్యం చేసేందుకు రాత్రి పూట ప్రత్యేక ఛార్జింగ్ టారిఫ్‌లు (టైమ్‌ ఆఫ్‌ డే టారిఫ్‌) ప్రవేశపెట్టడం కీలకమని గడ్కరీ పేర్కొన్నారు. రాత్రి వేళల్లో ఇళ్ల వద్ద లేదా ఛార్జింగ్ పాయింట్లలో తక్కువ ధరకే వాహనాలను ఛార్జ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తే వినియోగదారులు సాంప్రదాయ ఇంధన వాహనాల నుంచి ఈవీలకు మారేందుకు ఆసక్తి చూపుతారని అంచనా వేశారు.

ఇంధనం/రకం1,000 కిమీ ప్రయాణ అంచనా ఖర్చుమైలేజ్ / సామర్థ్యం ఆధారంగా
ఈవీ (రాత్రి ఛార్జింగ్ - రూ.3/యూనిట్)రూ.6001 యూనిట్‌కు 5 కిమీ (200 యూనిట్లు)
ఈవీ (పగటి ఛార్జింగ్ - రూ.5/యూనిట్)రూ.1,0001 యూనిట్‌కు 5 కిమీ (200 యూనిట్లు)
డీజిల్ కార్రూ.6,522లీటర్‌కు 15 కిమీ (రూ.97.83/లీటర్)
పెట్రోల్ కార్రూ.7,414లీటర్‌కు 15 కిమీ (రూ.111.21/లీటర్)

కంపెనీల తీరు ఇలా..

దేశీయంగా లిథియం-అయాన్ బ్యాటరీల ఉత్పత్తి పెరగడం వల్ల గతంలో కిలోవాట్-అవర్‌కు 150 డాలర్లుగా ఉన్న బ్యాటరీల వ్యయం ఇప్పుడు 50 డాలర్లకు పడిపోయిందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్‌లో ఏటా 6,000 ఎలక్ట్రిక్ బస్సులు తయారవుతున్నాయని, రాబోయే రెండేళ్లలో 10,000 బస్సుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. టాటా, అశోక్ లేలాండ్, వోల్వో వంటి సంస్థల భాగస్వామ్యంతో హైడ్రోజన్ ఆధారిత ట్రక్కులు, బస్సులను త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు.

నాలుగు నెలల్లో 10 కీలక రహదారుల్లో హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ20 (20 శాతం ఇథనాల్) ఇంధనం వాడకం దాదాపు 24 కోట్ల వాహనాల్లో సజావుగా సాగుతోందని, 100 శాతం బయో ఇథనాల్‌తో నడిచే వినూత్న మోడళ్లను ఆటోమొబైల్ సంస్థలు మార్కెట్‌లోకి తెస్తున్నాయని వివరించారు. భారత్‌ను ఇంధన దిగుమతిదారు నుంచి ఇంధన ఎగుమతిదారుగా మార్చడమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ ఇంధన విభాగాల్లో రీసెర్చ్, మౌలిక సదుపాయాలను వేగవంతం చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: భారత్‌లో 1500 శాతం పెరిగిన గోల్డ్‌ స్మగ్లింగ్‌

Videos

పులివెందులలో మొదలైన దౌర్జన్యం.. పెట్రోల్ బాంబులతో దాడులు

58 ఓట్లతో YSRCP ఆధిక్యం.. తిరుపతిలో రీకౌంటింగ్ రగడ..!

కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్

పులివెందులలో బీటెక్ రవి కుట్రలు

రెండుసార్లు రీకౌంటింగ్ పెట్టినా.. YSRCP అభ్యర్థి విజయం..

నన్ను గెలిపించిన అనంతపురం ప్రజలకు మాటిస్తున్న..

అడ్డుకున్న పోలీసులు.. ఇచ్చిపడేసిన అవినాష్ రెడ్డి

నాకిచ్చిన బ్యాలెట్ నెంబర్ మూడు.. కానీ పేపర్ పై ఆ నెంబర్ లేదు..

గెలుపోటములు సహజం.. ఓటమిపై కోలగట్ల శ్రావణి రియాక్షన్

అయ్యా పోలీసువారు మొత్తం గెలిపించింది మీరే.. బూచేపల్లి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)

+5

'అక్క' మరో ప్రపంచంలో ఉంటే ఇలానే (ఫొటోలు)

+5

#బాలు-గీత ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

'మాయా లేడీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కేజీఎఫ్' తల్లి.. టాలీవుడ్ ఎంట్రీ (ఫొటోలు)

+5

సమంత కొత్త ఫొటోషూట్ (ఫోటోలు)

+5

చూపులతోనే కట్టిపడేస్తున్న కరీనా కపూర్‌..(ఫోటోలు)